E-Paper
Advertisement

Parasakthi Release Date : శివకార్తికేయన్ ‘పరాశక్తి ‘ ముందుగానే వచ్చేస్తుంది.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..?

Parasakthi Release Date : శివకార్తికేయన్ ‘పరాశక్తి ‘ ముందుగానే వచ్చేస్తుంది.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..?
Advertisement

Parasakthi Release Date : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇటీవల ఈ హీరో నటించిన మదరాసి పెద్దగా ఆకట్టుకోలేదు.. గతంలో వచ్చిన అమరన్ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈయన పరాశక్తి సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం అడ్డుపడుతూనే ఉంది.. ఇటీవలే ఓటీటీ డీల్ కూడా భారీ ధరకు క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. ఇలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ మారినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ముందుగా అనుకున్న డేట్ కన్నా కాస్త ముందుగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించబోతుందంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఆ మూవీ ఒకవేళ ముందుగా వస్తే ఏ డేట్ ను లాక్ చేసుకుంటుందనేది ఒకసారి తెలుసుకుందాం..

‘పరాశక్తి ‘ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..? 

శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు పరాశక్తి మూవీకి సుధా దర్శకత్వం వహిస్తున్నారు.. డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అందులో ‘సింగారాల సీతాకోకచిలుకవే’ అన్న పాటకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రానా కీలక పాత్రలో నటిస్తుండగా.. అథర్వ, రవి మోహన్‌, బాసిల్ జోసెఫ్‌ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. కొన్ని వివాదాల కారణంగా సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతుందని అనౌన్స్ చేశారు. అయితే కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్‌ జననాయగన్‌తో పరాశక్తికి బాక్సాఫీస్‌ వద్ద పోటీ ఉండబోతుందట.. ఇక అదే విధంగా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉండడంతో ఈ సినిమా ఇంకాస్త ముందుకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. దానివల్ల ఈ మూవీని జనవరి 10 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. సంక్రాంతి పోటీలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్‌ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ఫలితాలు వస్తాయనేది సస్పెన్స్‌గా మారింది..

పొలిటికల్ డ్రామాగా మూవీ.. 

Advertisement

హీరో శివ కార్తికేయన్ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. గతంలో ఈయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. అమరన్ చిత్రం ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మదరాసి చిత్రం జనాలను మెప్పించలేకపోయింది.. ఇప్పుడు పరాశక్తి సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పొలిటికల్ హిస్టారికల్‌ డ్రామా స్టోరీతో రాబోతుంది.. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, పాటలు బాగానే రెస్పాన్స్ని అందుకున్నాయి. దాంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. ఈ మూవీ శివ కార్తికేయన్కు ఎలాంటి రికార్డులను తెచ్చి పెడుతుందో చూడాలి…

Related News

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

అమితాబ్ కి సర్జరీ.. ఎంత పెద్ద తోపైనా ఓటమి తప్పదంటూ పోస్ట్!

‘టాక్సిక్’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రొమాంటిక్ మోడ్‌లోకి రాకింగ్ స్టార్!

“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

Big Stories

Advertisement
×