E-Paper
Advertisement

Pawan Kalyan – Deva Katta, Balakrishna – Vivek Athreya: హైప్ క్రియేట్ చేస్తున్న కాంబోలు..! కానీ బాక్సాఫీస్ దగ్గర నిలుస్తాయా?

Pawan Kalyan – Deva Katta, Balakrishna – Vivek Athreya: హైప్ క్రియేట్ చేస్తున్న కాంబోలు..! కానీ బాక్సాఫీస్ దగ్గర నిలుస్తాయా?
Advertisement

Pawan Kalyan – Deva Katta, Balakrishna – Vivek Athreya: టాలీవుడ్ టాప్ హీరోలు ఇప్పుడు రొటీన్ మాస్ సినిమాలకు ‘గుడ్ బై’ చెప్పేసి, కొత్త దారి వెతుక్కుంటున్నారు. ఒకే రకమైన ఫైట్లు, పాటలు చూసి బోర్ కొట్టిన ఆడియన్స్‌కి పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ అదిరిపోయే షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. మరీ ముఖ్యంగా వీరు ఎంచుకున్న డైరెక్టర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.

పవన్ కళ్యాణ్ – దేవా కట్టా: పొలిటికల్ హీట్!
టాలీవుడ్‌లో ‘రీమేక్ రాజా’గా ముద్రపడ్డ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ లాంటి మాస్ పవర్ ఉన్న హీరో దొరికితే ఏదో కొత్తగా చూపిస్తాడనుకుంటే, మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి లాంటి రొటీన్ మాస్ కథను వడ్డించి అభిమానుల సహనానికి పరీక్ష పెట్టారు. “నాకు ఇలాంటి సినిమాలే వచ్చు” అని హరీష్ ఒప్పేసుకోవడం ఆయన మేకింగ్ స్టైల్ ఎంత ‘అవుట్‌డేటెడ్’ అయిపోయిందో చాటిచెబుతోంది. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ కూడా రూట్ మార్చి, రియలిస్టిక్ సినిమాల దర్శకుడు దేవా కట్టాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’ వంటి సీరియస్ పొలిటికల్ డ్రామాలు తీసే దేవా కట్టాతో పవన్ సినిమా అంటే, అది పక్కాగా రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించడం కష్టమేనని ట్రేడ్ వర్గాల మాట. దేవా కట్టా గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడం, ఆయన నెరేషన్ చాలా స్లోగా ఉండటం పవన్ అభిమానుల్లో కొత్త ఆందోళన మొదలుపెట్టింది. పవన్ తన పొలిటికల్ ఇమేజ్‌ను వెండితెరపై రుద్దాలని చూస్తున్నారా? అన్న నెగెటివ్ కామెంట్స్  సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయ్  కూడా.

Advertisement

బాలయ్య – వివేక్ ఆత్రేయ: ఊహించని కాంబో!
మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా తన ఊర మాస్ ఇమేజ్‌ను రిస్క్‌లో పడేసేలా వివేక్ ఆత్రేయ వంటి ‘క్లాస్’ డైరెక్టర్‌ను ఎంచుకున్నాడన్న అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలనే తొందరలో బాలయ్య కంటెంట్ కంటే కాంబినేషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.‘సరిపోదా శనివారం’ వంటి డిఫరెంట్ స్క్రీన్ ప్లే సినిమాలతో మెప్పించిన వివేక్ ఆత్రేయ, బాలయ్య మార్క్ భారీ యాక్షన్ సీన్లను, ఆ డైలాగ్ డెలివరీని ఏ మేరకు హ్యాండిల్ చేయగలడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. క్లాస్ డైరెక్టర్ల చేతిలో మాస్ హీరోలు ఇరుక్కుపోయిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. వివేక్ ఆత్రేయ మార్క్ స్లో టేకింగ్ బాలయ్య ఇమేజ్‌కు సరిపోకపోతే అది కెరీర్‌కు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యే ప్రమాదం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మించినా, కేవలం అయ్యప్పన్‌ కొషియం, తుడరుమ్‌, కొత్తలోక, సరిపోదా శనివారం చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన జేక్స్ బెజోయ్ మ్యూజిక్ మీద నమ్మకంతోనే బాలయ్య ఈ ప్రయోగానికి సిద్ధమయ్యారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా  రొటీన్ సినిమాలతో విసిగిపోయిన హరీష్ శంకర్ వంటి దర్శకులను పక్కన పెట్టి, ఇలాంటి భిన్నమైన దర్శకులను ఎంచుకోవడం ఒక రకంగా సాహసమే అయినా, అది తేడా కొడితే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×