E-Paper
Advertisement

Rythu Bharosa: ఈ సారీ రైతు భరోసాలో కొత్త ట్విస్ట్.. ఎన్ని ఎకరాలున్నా తొలివితలో మాత్రం..!

Rythu Bharosa: ఈ సారీ రైతు భరోసాలో కొత్త ట్విస్ట్.. ఎన్ని ఎకరాలున్నా తొలివితలో మాత్రం..!
Advertisement

Rythu Bharosa: స్వేచ్ఛ బ్యూరో: రైతు భరోసాపై ఎట్టకేలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే సీఎం రైతు భరోసా పథకం ద్వారా నిధుల విడుదల ప్రక్రియను చేపట్టారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వేదికగా తొలివిడత రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. 70 లక్షల రైతుల ఖాతాలో 3600 కోట్ల నిధులను విడుదల చేశారు. నేడు రైతులకు ఖాతాల్లో నగదు జమ కానున్నాయి. మిగిలిన రైతులకు రానున్న 45 రోజులలో 3 విడతల ద్వారా 9000 కోట్లు రైతుల ఖాతాలలో రైతు భరోసా సాయం జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని గద్వాల,అలంపూర్ నియోజకవర్గాలలో 97 క్లస్టర్ల వారిగా వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే మొదటి విడత నిధులు విడుదల చేయడంతో ఏప్రిల్ మధ్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడవ విడత నిధులను జమ చేయనున్నారు.

మొదటి విడతలో ఎకరం భూమి..

ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా మొదటి విడత కింద ఒక ఎకరం వరకు మాత్రమే డబ్బులు జమ కానున్నాయి. రెండో విడతలో మూడు ఎకరాల వరకు మూడో విడతలో మిగిలిన ఎకరాలకు రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 1.75 లక్షలకు పైగా రైతులు ఉండగా 3.52 లక్షల ఎకరాలలో సాగు విస్తీర్ణం ఉంది. మొదటి విడతలో ఎకరం భూమి ఉన్న రైతులకు ఎకరాకు 6000 చొప్పున రైతు భరోసా నిధులు నేడు జమ కానుంది. ప్రస్తుత రబీ సీజన్‌లో 6000 మంది రైతులు పాసు పుస్తకాలకు పొందారు. వీరికి సైతం రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే రైతు భరోసా సాయం పొందే రైతులు వివరాలు ఆన్లైన్‌లో నమోదు చేశారు. రబేసిజన్ ప్రారంభమైన దశలో రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తుండగా ప్రభుత్వం నిధులు విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: Vahan Portal: వాహనాదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో నేటి నుండి వాహన్ పోర్టల్ ప్రారంభం

రైతులకు ఆర్థిక తోడ్బాటు..

రబీ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా ఇప్పటికే పంటల సాగు ప్రారంభమైంది. ఖరీఫ్ లో అధిక వర్షాల వల్ల ఆశించిన స్థాయిలో పంటల దిగుబడులు రాకపోవడంతో రబీ సాగు పైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రైతు భరోసా నిధులు సైతం జమ కానుండగా వారికి పెట్టుబడులకు కాస్త ఊరట లభించనుంది. జిల్లాలో జూరాల, నెట్టెంపాడు ఆయకట్టు కింద వరిసాగు విస్తీర్ణం అధికంగా ఉంది. దీంతో రైతులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

కొత్త మార్గదర్శకాలు ఇలా

Advertisement

ప్రభుత్వం రైతు భరోసా కి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి రైతును సంతోషపరిచేలా నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఎకరంలోపు ఉన్న రైతులకే మొదట విడతలో డబ్బులు జమ అయ్యేవి. ఈసారి ఒక ఎకరాన్ని కంటే ఎక్కువ ఉన్న రైతులకు మొదటి విడతలో 6000 జమ చేయనుంది. అయితే కొత్త పట్టా పాస్ బుక్కు కలిగిన రైతుల ఖాతాలోను పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పట్టా పాస్ బుక్కులు పొందిన రైతులు ఏఈఓ లకు పాసుబుక్ ,ఆధార్ ,బ్యాంకు ఖాతా జిరాక్స్ అందజేయాల్సి ఉంటుంది.

ఏప్రిల్ నాటికి రైతుల ఖాతాల్లో నిధులు జమ

అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ ప్రక్రియ ప్రారంభమైంది. రైతులకు సంబంధించి ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు ఉన్నా వారి ఖాతాలలో డబ్బులు జమ చేయనుంది. ఏప్రిల్ నాటికి రైతులందరి ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. కొత్త పాసుబుక్కులు పొందిన రైతులు ఏఈఓ లకు వివరాలు అందజేయాలి. రైతుల అకౌంట్ నెంబరు మార్పు, ఇతర సమస్యలున్నా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.

Also Read: Janasena Controversy: త్రిసభ్య కమిటీ విచారణ తుస్సేనా.. జనసేన ఎమ్మెల్యేలపై సేనాని మౌనం ఎందుకో..!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×