E-Paper
Advertisement

Pawan Kalyan -Sujeeth: ఓజీ డైరెక్టర్‌కు కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎన్ని కోట్లంటే?

Pawan Kalyan -Sujeeth: ఓజీ డైరెక్టర్‌కు కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎన్ని కోట్లంటే?
Advertisement

Pawan kalyan -Sujeeth: టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు దర్శక నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులుగా ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉన్నవారిలో డైరెక్టర్ సుజీత్(Sujeeth) కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈయన ఏకంగా తన అభిమాన హీరోతో “ఓజి “(OG) అనే సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన సంగతి తెలిసిందే. సుజిత్ పవన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

కానుకగా ల్యాండ్ రోవర్ డిపెండర్ ..

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఓజి యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇలా ఓజి సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. డైరెక్టర్ కోసం ఏకంగా ఈయన ఖరీదైన ల్యాండ్ రోవర్ డిపెండర్ (Land Rover Defender)కారును కానుకగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన పవన్…

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ సుజిత్ కోసం కారుని గిఫ్టుగా ఇవ్వడంతో ఈ కారు ధర ఎంత ఉంటుందనే విషయం పట్ల కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ బ్రాండ్ కు చెందిన కార్లు బేసిక్ మోడల్ కోటి నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఖరీదైన కారును దర్శకుడికి కానుకగా ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయితే ఇలా డైరెక్టర్లకు హీరోలకు కార్లను కానుకగా ఇవ్వడం జరుగుతుంది.

https://twitter.com/BigtvCinema/status/2000818505302921455/photo/3

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ ఓజి సినిమా తర్వాత ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ పనులలో బిజీగా ఉన్నారు, త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది అయితే డైరెక్టర్ సుజీత్ నానితో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా పూర్తి అయిన తరువాతనే ఓజి సీక్వెల్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇక ఈ సినిమా వచ్చేయడాది చివరి నుంచి షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తుంది. ఓజి సినిమాని డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక ఆరుళ్ మోహన్ నటించిన సంగతి తెలిసిందే . రాజకీయ పనులలో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలపరంగా మంచి సక్సెస్ అందుకొని చాలా కాలం అయింది. ఓజి సినిమాతో అభిమానుల ఆకలిని తీర్చారని చెప్పాలి

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×