E-Paper
Advertisement

iPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రోపై రూ.40000 తగ్గింపు.. షాకింగ్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

iPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రోపై రూ.40000 తగ్గింపు.. షాకింగ్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
Advertisement

iPhone 16 Pro Discount | ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ 16 సిరీస్ లో అతిపెద్ద మోడల్ ఐఫోన్ 16 ప్రో. సెప్టెంబర్ 2024లో ఐఫోన్ 16 ప్రో విడుదలైంది. అయితే ఇప్పటికీ ఈ ఫోన్లకు డిమాండ్ తగ్గలేదు. కొన్ని నెలల క్రితమే ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయినా.. ఐఫోన్ 16 సిరీస్ క్రేజ్ తగ్గలేదు. ఈ సమయంలో తాజాగా ఐఫోన్ 16 ప్రో.. ఫ్లిప్‌కార్ట్ లో ఒక షాకింగ్ ఆఫర్ తో అత్యంత సరసమైన ధరలో లభిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16 ప్రో (128GB) ధరపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 21 వరకు ఉంటుంది. లాంచ్ సమయంలో ఈ ఐఫోన్ ధర రూ.1,09,900. అయితే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ కలిపి ఫైనల్ ధర రూ.70 వేల కిందకి వస్తుంది. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఇంత పెద్ద నాన్-ఫెస్టివ్ డిస్కౌంట్ అరుదు. మరో విశేషమేమిటంటే అమెజాన్ లో కూడా ఐఫోన్ 16 ప్రో ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. కానీ ఆఫ్‌లైన్ లో మాత్రం ఈ డిస్కౌంట్స్ లేవు.

ఎంత పొదుపు చేయొచ్చు?

Advertisement

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. పాత ఫోన్ ఇస్తే.. ఎక్స్‌చేంజ్‌లో రూ.68,050 వరకు వాల్యూ దొరుకుతుంది. పాత ఫోన్ మోడల్, కండీషన్ బట్టి వాల్యూ మారుతుంది. మిడ్ రేంజ్ ఫోన్ ఇస్తే రూ.35,000 నుంచి రూ.40,000 వరకు పొదుపు చేయొచ్చు. రెండు ఆఫర్లు కలిపి ధర రూ.70000కు తగ్గిపోతుంది.

ఈ ఆఫర్ ఎలా పొందాలి?

ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. “iPhone 16 Pro 128GB” సెర్చ్ చేయండి. ప్రొడక్ట్ పేజీలో యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్ చెక్ చేయండి. ఎక్స్‌చేంజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పాత ఫోన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎక్స్‌చేంజ్ వాల్యూ చూపిస్తారు. అన్ని ఆఫర్లు అప్లై అయిన తర్వాత చెక్‌అవుట్ చేయండి.

ఐఫోన్ 16 ప్రో ఫీచర్స్ ఏమిటి?

Advertisement

ఐఫోన్ 16 ప్రోలో ప్రీమియం టైటానియం ఫ్రేమ్ ఉంది. సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది. దీంతో ఫోన్ కింద పడిపోయినా అంత సులువుగా డ్యామేజ్ కాదు. ఈ ఫోన్ నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉంది. బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, న్యాచురల్ టైటానియం, డెసర్ట్ టైటానియం.

డిస్‌ప్లే, పర్ఫామెన్స్ ఎలా ఉంది?

ఐఫోన్ 16 ప్రోలో 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే ఉంది. 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్, HDR10, డాల్బి విజన్ సపోర్ట్ ఉంది. అవుట్‌డోర్‌లో 2000 నిట్స్ బ్రైట్‌నెస్ వస్తుంది. గేమింగ్, స్ట్రీమింగ్, కంటెంట్ క్రియేషన్‌కి బెస్ట్. ఇందులో A18 Pro చిప్ (3nm ప్రాసెసర్) ఉంది. ఫోన్‌లో సూపర్ పర్ఫామెన్స్, పవర్ ఎఫిషియెంట్.

Also Read: ఇంటర్నెట్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? దీనికి కారణం అదే..

సాఫ్ట్‌వేర్, AI ఫీచర్స్ ఏమిటి?

ఐఫోన్ 16 ప్రో లేటెస్ట్ iOSతో వస్తుంది. ఇందులో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్నాయి. మల్టీటాస్కింగ్, ప్రొడక్టివిటీ, అడ్వాన్స్‌డ్ ప్రాసెసింగ్ స్మార్ట్‌గా జరుగుతాయి. హై ఎండ్ గేమ్స్ ల్యాగ్ లేకుండా, ఓవర్ హీట్ కాకుండా రన్ అవుతాయి. కొత్త ఐఫోన్‌లు వచ్చినా ఐఫోన్ 16 ప్రో ఇంకా టాప్ ఫ్లాగ్‌షిప్. ఇప్పుడు రూ.70000 కంటే తక్కువ ధరలో ఫోన్ లభించడం ఒక అద్భుతమైన డీల్. ఫ్లిప్‌కార్ట్ సేల్ డిసెంబర్ 21 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సేల్ ముగిసేలోపే త్వరగా బుక్ చేసుకోండి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×