E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది? సడన్ సర్జరీ వెనుక అసలు నిజాలివే!

పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది? సడన్ సర్జరీ వెనుక అసలు నిజాలివే!
Advertisement

Pawan Kalyan :పవర్ స్టార్ .. పవన్ కళ్యాణ్ కి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగిందనే వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. గత కొద్ది నెలలుగా అటు పాలిటిక్స్, ఇటు సినిమాలంటూ బిజీ బిజీగా గడిపిన పవన్ శుక్రవారం ఉదయం తన అధికారులతో మీటింగ్‌లో ఉండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిజానికి ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం నాడు ఆయన ఎన్నో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని సమాచారం. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో వాటన్నింటినీ రద్దు చేసుకుని వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు.

శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ కి సర్జరీ

Advertisement

అక్కడ MRI పరీక్షలు చేసిన వైద్యులు పరిస్థితిని బట్టి ఏప్రిల్ 18 శనివారం సాయంత్రం ఆయనకు సర్జరీ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక ఒక్కసారిగా పవన్ కి సర్జరీ జరిగిందన్న వార్త బయటికి రావడంతో జనసైనికులు, ఇటు మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యతలను ఆయన భుజాన వేసుకున్నారు. ఇక పది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినప్పటికీ మునుపటి యాక్టివ్ అవ్వాలంటే మాత్రం ఎక్కువ టైం పడుతుందని తెలుస్తుంది. ఇక ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్, డిప్యూటీ సీఎంవో ప్రకటన విడుదల చేశాయి కూడా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని రాజకీయ పార్టీల నేతలు, కూటమి కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

లోకేష్ ఎమోషనల్ ట్వీట్

Advertisement

అంటే పది రోజుల విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ, మునుపటిలా నిరంతరం ప్రజల్లో తిరగడం, సుదీర్ఘ ప్రయాణాలు చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాకపోవచ్చన్న మాట. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ “పవనన్నా.. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోండి. నిత్యం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశగా, శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

 కంప్లీట్ కావడానికి ఎలా సహకరిస్తుందో

ఇక సినిమాల విషయానికి వస్తే కమిట్ అయిన ‘OG’ (ఓజీ), ‘హరి హర వీరమల్లు’, మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’లను పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం సురేందర్ రెడ్డికి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. చూడాలి మరి పవన్ హెల్త్ ఈ సినిమా కంప్లీట్ కావడానికి ఎలా సహకరిస్తుందో. ఏదేమైనా డిప్యూటీ సియం గా బాధ్యతలు ఒకపక్క, మరోపక్క అభిమానుల్ని నమ్ముకొని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్న మేకర్స్ మరోపక్క. మరి ఈ రెండింటినీ పవన్ కళ్యాణ్  ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×