E-Paper
Advertisement

పరశురాముడా లేక మరో అవతారమా? మహావతార్’ టీం సస్పెన్స్.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి టైం సెట్!

పరశురాముడా లేక మరో అవతారమా? మహావతార్’ టీం సస్పెన్స్.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి టైం సెట్!
Advertisement

Mahavatar Narasimha :స్టార్ హీరోలు అవసరం లేదు ..భారీ కటౌట్లు అసలే అవసరం లేదు. కావాల్సిందల్లా కనెక్ట్ చేయగలిగే కంటెంట్ అంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత అంటే ఏంటో చూపెట్టిన సినిమా మహావతార్ నరసింహ. అశ్విన్ కుమార్ (Ashwin Kumar). దర్శకత్వంలో వేదాంశ్ ఎంటర్‌టైన్‌మెంట్ (Vedansh Entertainment) బ్యానర్‌పై నిర్మించింది ఈ సినిమా.

స్క్రీన్ పై సరిగ్గా ప్రజెంట్ చేయగలిగితే

Advertisement

నిజానికి చాలా మంది పెద్ద పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నప్పుడు ఈ యానిమేషన్ సినిమా ఏంచేస్తుందిలే అని లైట్ తీసుకున్నారు. కానీ కంటెంట్ లో దమ్ముంటే, మన పురాణాల్లోని దైవత్వాన్ని సిల్వర్ స్క్రీన్ పై సరిగ్గా ప్రజెంట్ చేయగలిగితే బాక్సాఫీస్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ప్రూవ్ చేసింది ఈ సినిమా.అలా ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిపోయింది. అవును.. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ వస్తోంది అంటూ మేకర్స్ వదిలిన ప్రోమో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

రేపు ఆదివారం ఉదయం 11 గంటల 22 నిమిషాలకి

Advertisement

నిజానికి పోయినేడు రిలీజ్ అయిన నరసింహ సినిమా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. కేవలం భక్తిరసంతో కూడిన కంటెంట్‌ను నమ్ముకుని మేకర్స్ చేసిన ఈ ఎక్స్పరిమెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఎంతో మందికి కనువిప్పు కలిగించింది.అయితే ఈ సక్సెస్ ని అలాగే కంటిన్యూ చేస్తూ, ఈ యూనివర్స్ నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. రేపు ఆదివారం ఉదయం 11 గంటల 22 నిమిషాలకి ఒక కొత్త చాప్టర్ సంబందించి టైటిల్ రివీల్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో  మహావతార్ నరసింహ సినిమాలోని పవర్‌ఫుల్ విజువల్స్ తో కూడిన ఒక ప్రోమోను కూడా వదిలారు. దీంతో అటు ఆడియన్స్ లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ అసలు ఆ అప్‌డేట్ ఏంటి అనే క్యూరియాసిటీ పీక్స్ కి వెళ్ళిపోయిందనే చెప్పాలి.

మరో అవతారాన్ని ఏమైనా అనౌన్స్ చేయబోతున్నారా?

అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉందండోయ్. మహావతార్ నరసింహ సినిమా చివర్లో మేకర్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘మహావతార్ పరశురామ’ అని క్లియర్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఇస్తున్న అప్‌డేట్ లో మాత్రం పరశురాముడి గురించి చిన్న హింట్ కూడా లేదు. కేవలం మహావతార్ నరసింహ విజువల్స్ మాత్రమే చూపిస్తుండటంతో, ఇది నరసింహ సినిమాకి సీక్వెలా? లేక పరశురాముడి కంటే ముందే మరో అవతారాన్ని ఏమైనా అనౌన్స్ చేయబోతున్నారా? డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.ఒకరకంగా మేకర్స్ మైండ్ లో ఏముందో ఎవరికీ అంటూ పట్టకుండా ఉంది. ఇక పరశురామ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి మరేదైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అనే డిబేట్ కూడా మొదలైపోయింది. చర్చ కూడా జరుగుతోంది.

also read:‘వరల్డ్ వార్ z’ సీక్వెల్ వచ్చేస్తుంది.. 13 ఏళ్ల తర్వాత నిర్మాతలు కీలక నిర్ణయం, బ్రాడ్ పిట్ ఉంటాడా?

https://x.com/i/status/2045443012868886758

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×