E-Paper
Advertisement

Pawan kalyan : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ టాప్ బ్యానర్ లో పవన్ కొత్త సినిమా..?

Pawan kalyan : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ టాప్ బ్యానర్ లో పవన్ కొత్త సినిమా..?
Advertisement

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒకవైపు రాజకీయాలతోను, మరోవైపు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం ఈయన నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా సుజీత్ తో ఓజి 2 లు లాక్ అయ్యి ఉన్నాయి.. అయితే పలు నిర్మాణ సంస్థల దగ్గర పవన్ కళ్యాణ్ డేట్స్ ఉండడంతో ఆయన వరుసగా సినిమాల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అర్థమవుతుంది.. తాజాగా మరో టాప్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రాబోతుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అసలు ఆ బ్యానర్ ఏంటో? డైరెక్టర్ ఎవరు? అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

బడా బ్యానర్ లో పవన్ కొత్త చిత్రం.. 

పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కోరిక మేరకు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. మరో రెండు సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈ క్రమంలో మరో బడా బ్యానర్ లో కొత్త సినిమా రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆ బ్యానర్ మరేమిటో కాదు.. యూవీ.. ఈ బ్యానర్లో ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి.. వీటి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది..గతంలో రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కుదరలేదు.. ఇప్పుడు పవన్ తో సినిమా అనే టాక్ ఎంతవరకు నిజమో తెలియలేదు.. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్లో పాల్గొనలేదు. మరి కాంబోలో సినిమా అన్నది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది..

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ లో డాక్టర్ బాబు.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్… మ్యాటరేంటంటే..?

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో గతంలో సినిమాలు వచ్చాయి.. అందులో గబ్బర్ సింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నేళ్ళకు ఈ కాంబో రిపీట్ అవ్వడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. డిఫరెంట్ స్టోరీ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.. ఇప్పటివరకైతే భారీగా అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×