E-Paper
Advertisement

Aus vs Pak: టుక్ టుక్ ఆటోలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు..దారుణంగా అవమానించిన పాకిస్థాన్, బాంబులేస్తే ఎవ‌డురా బాధ్యుడు

Aus vs Pak: టుక్ టుక్ ఆటోలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు..దారుణంగా అవమానించిన పాకిస్థాన్, బాంబులేస్తే ఎవ‌డురా బాధ్యుడు
Advertisement

Aus vs Pak: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Australia) మధ్య టి20 సిరీస్ ( Australia tour of Pakistan, 2026) జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం సిద్ధం అయ్యేందుకు గాను ఈ మూడు టి20 సిరీస్ నిర్వహిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అందులోనూ బలమైన ఆస్ట్రేలియాతో ఈ టోర్నమెంట్ ఆడనుంది పాకిస్తాన్. ఈ మేరకు ఇప్పటికే పాకిస్తాన్ దేశానికి ఆస్ట్రేలియా క్రికెటర్లు వెళ్లి, మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు దారుణ అవమానం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌ను ( Mitchell Marsh ) ప్యాసింజర్ ఆటో ( Passenger Auto Rickshaw )లో తిప్పింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, పాకిస్తాన్ పరువు తీస్తున్నారు.

Also Read: Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

ఆటోలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌.. పాకిస్తాన్ పై ట్రోలింగ్

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ్టి నుంచి మూడు టి20ల‌ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టైటిల్ లాంచ్ కార్యక్రమం లాహోర్ వేదికగా జరిగింది. కట్టు దిట్టమైన భద్రత నడుమ ఈ ట్రోఫీ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman ali agha) ఇద్దరు ఈ కార్యక్రమంలో పాల్గొని, టైటిల్ లాంచ్ చేశారు. అనంతరం ఈ ఇద్దరు కెప్టెన్లు టుక్ టుక్ ఆటోలో ప్రయాణించారు. ఎలాంటి సెక్యూరిటీ లేని ఆటోలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ను తీసుకువెళ్లింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

ఉగ్ర దాడులు ఎప్పుడు జరుగుతాయో ? తెలియని లాహోర్ లో ఇలా ప్యాసింజర్ ఆటోలో ( auto rickshaw  ) ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌ ను ఎలా ఎక్కిస్తారని ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ఇలాంటి సమయంలో బాంబు బ్లాస్ట్ జరిగితే ఎవడు బాధ్యత తీసుకుంటాడని నిలదీస్తున్నారు. అటు ఆస్ట్రేలియా మీడియా కూడా దీనిపై సీరియస్ అవుతోంది. ఉగ్ర దాడులు జరిగే పాకిస్తాన్ లో ఆస్ట్రేలియా పర్యటించడం దారుణమని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొంతమంది అయితే ఆటోడ్రైవర్ అచ్చం మహమ్మద్ రిజ్వాన్ ( Rizwan) లాగానే ఉన్నాడని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ బడ్జెట్ కు ఆటో మాత్రమే వస్తుందని… అసలు కార్లు, స్పెషల్ వాహనాలు ఉండబోవని సెటైర్లు పేల్చుతున్నారు. కాగా ఆస్ట్రేలియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య ఇవాళ సాయంత్రం 4.30 గంట‌ల‌కు గ‌డాఫీ ( Gaddafi Stadium, Lahore ) వేదిక‌గా టీ20 మ్యాచ్ జ‌రుగ‌నుంది.

Advertisement

Also Read: Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

 

 

 

 

?igsh=N3A4Nm56c3RlZGhx

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×