E-Paper
Advertisement

39 ఏళ్ల నాటి జ్ఞాపకాలు.. పవన్ భార్య ఊహించని పోస్ట్!

39 ఏళ్ల నాటి జ్ఞాపకాలు.. పవన్ భార్య ఊహించని పోస్ట్!
Advertisement

Anna Lezhneva: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఆయన భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) ఎక్కువగా పబ్లిక్ లో కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా వెంటే ఉంటూ ఆయనకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న ఈమె ఇటీవల ఇంస్టాగ్రామ్ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే.. అయితే ఈమె ఖాతా అలా తెరిచారో లేదో అప్పుడే మెగా బ్రదర్స్ కి కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే అతి తక్కువ సమయంలోనే వేలమంది ఫాలోవర్స్ వచ్చి చేరారు.

39 ఏళ్ల నాట్యం స్మృతులను గుర్తు చేసుకున్న అన్నా..

ఇక అప్పటినుంచి ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్న ఈమె.. నుదుటన ఎలాంటి స్టిక్కర్ పెట్టుకోవాలి అనే దగ్గర నుంచి తన పాత జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే 39 ఏళ్ల నాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకుంటూనే తన భర్త పై మమకారాన్ని చూపించారు. అలాగే తన భర్త తనపై చూపించిన ప్రేమకు తాను ముగ్ధురాలిని అవుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది . మరి అన్నా లెజినోవా నాటి జ్ఞాపకాలను ఏ విధంగా అభిమానులతో పంచుకుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

చిన్న చేతులతో పియానో వాయిస్తూ 7 ఏళ్ల వయసు నాటి ఫోటోని షేర్ చేసిన అన్నా..

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా తాను ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పియానో వాయిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఇక ఆ ఫోటోతో పాటు..” ఇక్కడ ఉన్న చిన్నారిని నేనే ..నా వయసు అప్పుడు ఏడు సంవత్సరాలు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో చదువుకునే రోజులవి.అసలే చలికాలం.. అక్కడి వాతావరణం చల్లగా ఉంది . ఇంకా వెలుతురు కూడా అప్పుడప్పుడే వస్తున్న సమయంలో నేను, నా సంగీత పాఠశాలలో ఒక పెద్ద వేదికపై నిలబడి ఉన్నాను . నా టర్మ్ కచేరి కోసం.. అయితే అది పరీక్ష అంత గంభీరమైన సమయం అయినప్పటికీ చాలా చిన్న చేతులతో పియానో పట్టుకొని లుడ్విగ్ వాన్ బీథోవెన్ రచించిన లా మార్మోట్ ను వాయిస్తున్నాను. మా గురువు నా పక్కన కూర్చొని.. నాకు సహకారం అందిస్తూనే నన్ను ముందుండి నడిపించారు. మూడు సంవత్సరాల తర్వాత నేను స్వయంగా పియానో వాయించడం మొదలు పెట్టాను. నాకు ఐదేళ్ల వయసు వచ్చినప్పుడు నేను వయోలిన్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. స్కూలింగ్ తో పాటు పదిహేనేళ్ల వయసులో పట్టభద్రురాలయ్యే వరకు సంగీత పాఠశాలలకు నేను హాజరయ్యాను.

ఇన్నేళ్లయినా సంగీతం ఎక్కడో నాలో ఒక భాగం అయింది..

అయితే వృత్తిపరమైన సంగీత ప్రస్థానాన్ని కొనసాగించలేకపోయినప్పటికీ ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం ఎల్లప్పుడూ నాలో ఒక భాగమై ఉంటుంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది . అయితే నేను భారతదేశానికి వచ్చినప్పుడు నా భర్త పవన్ కళ్యాణ్ నాకొక పియానో కొనిచ్చారు. వయోలిన్ కూడా ఇక్కడే ఉంది . దానిని పెట్టెలో భద్రంగా ఉంచాను. అయితే ఎందుకో ఈ మధ్య వాయించాలనే మునుపటి తపన నాకు కలగడం లేదు. సంగీతం ఇంకా నాలో ఎక్కడో ఉంది . మళ్లీ వినడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా అనిపిస్తోంది.

Advertisement

also read:అరుదైన గౌరవం అందుకున్న రామ్ చరణ్.. స్పెషల్ అట్రాక్షన్ గా రైమ్!

ఆ అనుభూతిని ఇచ్చేది సంగీతం మాత్రమే..

సంగీతం.. భాష, నేపథ్యానికి అతీతంగా ప్రజలను కలుపుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ముఖ్యంగా మనం ఒక్క మాట మాట్లాడకపోయినా.. బాధను, ప్రేమను , ఆనందం యొక్క అనుభూతిని ఈ సంగీతం ద్వారా పొందగలం అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది అన్నా లెజినోవా . ప్రస్తుతం ఈమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మళ్లీ నాటి రోజులు తిరిగి రావాలి అని, సంగీతంలో మీ ప్రావీణ్యం కనబరిచి అందరినీ ఆకట్టుకోవాలని అభిమానులు, సంగీత ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×