E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: T20 వరల్డ్ కప్ ఫైనల్ వేదికగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్‌.. ఏం ప్లాన్ గురూ..

Ustaad Bhagat Singh: T20 వరల్డ్ కప్ ఫైనల్ వేదికగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్‌.. ఏం ప్లాన్ గురూ..
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ వేగం పెంచింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. నేడు జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ (IND vs NZ) మ్యాచ్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ గ్లింప్స్‌ను ప్రసారం చేయాలని మేకర్స్ నిర్ణయించారు. క్రికెట్ ఫీవర్ పీక్స్‌లో ఉన్న సమయంలో, కోట్లాది మంది భారతీయులు టీవీలకు అతుక్కుపోయే ఈ మెగా ఈవెంట్‌ను ప్రమోషన్ కోసం వాడుకోవడం చిత్ర యూనిట్ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్లింప్స్ ద్వారా సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేయడమే కాకుండా, సామాన్య ప్రేక్షకుల్లోకి కూడా సినిమాను బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు చాట్ బాస్టార్లుగా నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మార్చి 19, 2026 న విడుదల కానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Allu Cinemas: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపు అల్లు సినిమాస్‌పై అప్డేట్!

అక్కడ ప్రమోషన్స్ ఎందుకంటే?

Advertisement

ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ వెనుక ఒక బలమైన కారణం ఉంది. చిత్ర బృందం ఇప్పటికే సినిమా విడుదల తేదీని ప్రీపోన్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత మార్చి 26న విడుదల చేయాలనుకున్నప్పటికీ, ఇప్పుడు ఒక వారం ముందుగానే అంటే మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఉగాది పండుగ సెలవులను క్యాష్ చేసుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద సోలో రన్ దక్కించుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ కొత్త తేదీని తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికీ చేరవేయడానికి వరల్డ్ కప్ ఫైనల్ కంటే పెద్ద వేదిక మరొకటి ఉండదు. నేటి గ్లింప్స్ ద్వారా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రాకను అధికారికంగా, గ్రాండ్‌గా చాటి చెప్పబోతున్నారు.

Read also-Anurag Accident: సూసైడ్ అటెమ్ట్‌ను ఇన్‌స్టాలో లైవ్ స్టీమ్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఏం జరిగిందంటే?

Advertisement

దర్శకుడు హరీష్ శంకర్ తన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ గ్లింప్స్‌ను పవర్‌ఫుల్‌గా కట్ చేసినట్లు సమాచారం. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ – హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ అందించే సంగీతం, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తానికి వరల్డ్ కప్ ఫైనల్ వేదికగా ‘ఉస్తాద్’ గ్లింప్స్ రానుండటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. అయితే ఈ గ్లింప్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×