E-Paper
Advertisement

Ustaad Bhagat Singh Promo : ఉస్తాద్ పవర్ ప్యాక్డ్ ప్రోమో, ఫుల్ సాంగ్ వచ్చేది అప్పుడే 

Ustaad Bhagat Singh Promo : ఉస్తాద్ పవర్ ప్యాక్డ్ ప్రోమో, ఫుల్ సాంగ్ వచ్చేది అప్పుడే 
Advertisement

Ustaad Bhagat Singh Promo : ఉస్తాద్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను మొదట అనౌన్స్ చేసినప్పుడు భవదేయుడు భగత్ సింగ్ అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన టైటిల్ మార్చేశారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రీయంట్రీ తర్వాత అనౌన్స్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా మినహాయిస్తే, రీయంట్రీ తర్వాత విడుదలైన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయాయి.

భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్న కూడా అప్పుడున్న టికెట్స్ రేట్స్ వలన బ్రేక్ ఈవెన్ కూడా పలు ప్రాంతాలలో అవలేదు. అయితే ఇప్పుడు చాలామంది ఆసక్తితో ఎదురుచూస్తున్న కాంబినేషన్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్. సినిమాకి సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తి అయిపోయింది. మార్చ్ 26న ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో 

Advertisement

పవన్ కళ్యాణ్ అభిమానిగా హరీష్ శంకర్ కు విపరీతమైన క్లారిటీ ఉంది అని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. చాలా స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ ను ఈ ప్రోమోలో చూపించాడు. ముఖ్యంగా బద్రి సినిమా రోజులు మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయి.

“రంపంపం స్టెప్ ఏస్తే భూకంపం దేఖెలేంగే సాలా, చూసినాంలే చాలా” అని మొదలైన ఈ ప్రోమో. హీరో క్యారెక్ట‌రైజేష్‌తో పాటుగా సెట్యువేష‌న్‌కి త‌గిన పాట ఇది అనిపిస్తుంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో డాన్స్ చేశారు అనిపిస్తుంది. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటకు సాహిత్యం అందించారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అన్నిటిని మించి పవన్ కళ్యాణ్ క్లాసి స్టెప్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

సాంగ్ రిలీజ్ అప్పుడే

రీసెంట్ టైమ్స్ లో మెగా ఫ్యామిలీకి అన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ దాదాపు 100 మిలియన్ల పైగా వ్యూస్ సాధించుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు పాట 80 మిలియన్స్ వ్యూస్ సాధించుకుంది.

ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ డిసెంబర్ 13న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాదులో ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఈ పాటను విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read : Rajinikanth : నీలాంబరి పాత్రను మిస్ చేసుకున్న ఐశ్వర్యరాయ్, అసలు బ్యాక్ స్టోరీ ఏంటంటే?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×