E-Paper
Advertisement

Nari Nari Naduma Murari : శర్వానంద్ కూడా తగ్గడం లేదు, శతమానం భవతి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Nari Nari Naduma Murari : శర్వానంద్ కూడా తగ్గడం లేదు, శతమానం భవతి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Advertisement

Nari Nari Naduma Murari : 2026 సంక్రాంతికి సంబంధించి ఆల్రెడీ చాలా సినిమాలు ప్లాన్ అయిపోయాయి. అయితే సంక్రాంతి కానుకగా సర్వానంద నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే సంక్రాంతికి భారీ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఎట్టకేలకు పోస్ట్ పోన్ అవుతుంది అని అందరూ ఊహించారు. వాస్తవానికి సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల్లో అతి తక్కువ బజ్ ఉన్న సినిమా ఇది.

అయితే సంక్రాంతి సీజన్ లో ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వస్తూ ఉంటారు. దీనినే దృష్టిలో పెట్టుకొని చాలా సినిమాలు సంక్రాంతి కానుకగా రానున్నాయి. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు ఈ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు చూసేవి. ఇప్పుడు శర్వానంద్ సినిమా టైటిల్ చూస్తుంటే ఇది కూడా ఫ్యామిలీ సినిమా అని అర్థం అయిపోతుంది.

శతమానం భవతి మ్యాజిక్ రిపీట్?

Advertisement

తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలాసార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. అదే తరుణంలో శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమా కూడా విడుదలైంది.

ఒకవైపు మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా, మరోవైపు బాలకృష్ణ 100వ సినిమా మధ్యలో కూడా శతమానం భవతి సత్తా చాటింది. అయితే స్వతహాగా ఆ సినిమాకి నిర్మాత దిల్ రాజు కావడంతో ఆ సంక్రాంతి సీజన్ కూడా బాగా ప్లస్ అయింది అని చెప్పాలి. అంబికా దర్బార్ భక్తికి భగవంతునికి మధ్య సంబంధం ఉన్నట్లు సంక్రాంతి సీజన్ కి మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది.

Advertisement

అయితే ఇప్పుడు కూడా భారీ సినిమాలతో నారీ నారీ నడుమ మురారి సినిమాను విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. శతమానం భవతి మ్యాజిక్ ఈ సినిమాకు వర్కౌట్ అవుతుందేమో చూడాలి.

నవీన్ పోలిశెట్టి సినిమాపై హైప్స్ 

మరోవైపు నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా మీద కూడా మంచి హైప్ ఉంది. అంతేకాకుండా ఆ సినిమా కూడా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతుంది. రీసెంట్ గా ఆ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేస్తున్నాడు నవీన్. ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read: Ustaad Bhagat Singh Promo : పవన్ కళ్యాణ్ అభిమానులకు తనివి తీరిపోయింది, ఇది కదా కోరుకుంది

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×