Payal Rajput: హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది పాయల్. ఈ సినిమా తర్వాత అమ్మడిని ఆపడం ఎవరి తరం కాదు అనుకున్నారు. కానీ పాయల్ మాత్రం కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది.
ఆర్ఎక్స్ 100 సినిమాలోని క్యారెక్టర్ లానే మిగతా అన్ని సినిమాల్లో కూడా అలాంటి పాత్రలే చేసి.. పాయల్ అంటే అలాంటి పాత్రలకే అంకితం అనే విధంగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వెంటనే చేతులు కాల్చుకున్నాను అని తెలుసుకున్న ఈ చిన్నది నెమ్మదిగా స్టార్ హీరోల సరసన నటించడం మొదలుపెట్టింది. చేతులు కాల్చుకున్నాకా ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నట్లు అవేమి ఫలితం లేకుండా పోయాయి.
ఇక అందాల ఆరబోతకు తప్ప పాయల్ దేనికి పనికిరాదు అనే విధంగా ఇండస్ట్రీలోమాట్లాడుకుంటున్న సమయంలో మంగళవారం అనే సినిమాతో మరో షాక్ ఇచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని పాయల్ లోని మరో రూపాన్ని ఆవిష్కరించింది. ఆర్ఎక్స్ 100 సినిమాకు దర్శకత్వం వహించిన అజయ్ భూపతినే మంగళవారం సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. ఇక ఆయన దర్శకత్వంలో తప్ప అమ్మడికి సరైన హిట్టే దక్కదు అని కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలోనే పాయల్ మంగళవారం 2 సినిమా చేస్తుంది. ఇది తప్ప ఆమె చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ చేయడం లేదు.
సినిమాలు లేకపోతే ఏం సోషల్ మీడియా లేదా అన్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో పాయల్ హల్చల్ చేస్తుంది. నిత్యం అందాల ఆరబోత చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే థైస్ షో లేకపోతే క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారకు రాత్రుళ్లు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ భామ మరోసారి థైస్ షోతో సోషల్ మీడియాను హీటెక్కించింది.
సూపర్ కేప్ క్లాతింగ్ బ్రాండ్ కు ప్రమోషన్ చేస్తున్నట్లు పాయల్ కనిపిస్తుంది. ఒక లూజ్ టీ షర్ట్ ను మాత్రమే వేసుకొని.. నీట్ గా జడ వేసుకొని, బుట్టలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని.. ముఖంలో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తూనే.. డ్రెస్ లో మోడ్రన్ లుక్ తో విభిన్నంగా కనిపించింది. కేవలం లూజ్ టీ షర్ట్ మాత్రమే వేసుకోవడంతో అమ్మడి థైస్ అందాలను కిక్కెక్కిస్తున్నాయి. కావాలనే అమ్మడు కింద ప్యాంట్ వేసుకోలేదని తెలుస్తోంది. ఇక ఈ రేంజ్ పాయల్ అందాలను ఆరబోస్తే ఫ్యాన్స్ ఊరికే వదిలేస్తారా.. ఒకపక్క కామెంట్స్.. ఇంకోపక్క షేర్స్ తో నెట్టింట పాయల్ ఫోటోలను వైరల్ చేసేశారు.
ఇక పాయల్ ఫోటోలకు నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా పాయల్ పాపా.. అయినా హాట్ గానే ఉన్నావనుకో అని ఒకరు.. అబ్బా ఏమున్నాయి ఆ థైస్ .. అదిరిపోయాయి అని ఇంకొకరు. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు అని సాంగ్స్ కూడా పడేస్తున్నారు. మరి అమ్మడు ఇలా ఫోటోషూట్స్ తో కాకుండా సినిమాలతో గుర్తింపు ఎప్పుడు తెచ్చుకుంటుందో చూడాలి.