E-Paper
Advertisement

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..
Advertisement

Peddi Celebration: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు, యావత్ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ #PEDDI ఎట్టకేలకు వెండితెరపైకి వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి షో నుంచే థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. రామ్ చరణ్ మాస్ మేనియాకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుండి ‘పెద్ది’ చిత్రానికి ఎక్సెప్షనల్ అండ్ మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై భారీగా ప్రేమను కురిపిస్తున్నారు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయని, సినిమా చూసిన ప్రేక్షకులు కాలర్ ఎగరేసి చెబుతున్నారు.

Read also-దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

రామ్ చరణ్ క్రేజ్

Advertisement

ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ ‘పెద్ది’ చిత్రం సంచలన బుకింగ్స్‌తో తన బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. రామ్ చరణ్‌కు ఉన్న అన్‌మ్యాచ్‌డ్ క్రేజ్ మరోసారి ఈ సినిమాతో నిరూపితమైంది. విడుదలైన ప్రతి సెంటర్ లోనూ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. థియేటర్ల లోపల అసాధారణమైన క్రౌడ్ రియాక్షన్స్, పేపర్ ముక్కలు చల్లడం, ఈలలు, గోలలతో థియేటర్ కాస్తా ఒక జాతరను తలపిస్తోంది. మెగా పవర్ స్టార్ వన్‌మెన్ షోతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైందని, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ‘పెద్ది’ మెగా అభిమానులకు అసలైన పూనకాలను తెచ్చిపెట్టింది.

Read also-‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

Advertisement

ఇదిలా ఉండగా రామ్ చరణ్ పెద్ది సినిమా పోస్టర్ ను ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు మరి కొందకె ఫ్యాన్స్. అయితే ఇదే సందర్భంలో ఒక లేడీ ఫ్యాన్ చరణ్ పోస్టర్ కు పాలాభీషేకం చేసి తన అభిమానాన్ని చాటకుంది. అంతే కాకుండా అక్కడే డాన్స్లు కూడా వేసింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రామ్ చరణ్, మెగా అభిమానులు పెద్ది హిట్ టాక్ తెచ్చుకోవడంతో సంబరాలు చేసుకంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కూడా పెద్దిపై తన అభిప్రాయాన్ని తెలిపారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా చరణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×