E-Paper
Advertisement

నువ్వొస్తానంటే.. మేమొద్దంటామా? ప‌వ‌న్‌కు ప్ర‌కాశ్ చుర‌కే క‌రెక్టు..! అన‌వ‌స‌ర హైప్ ఇస్తున్నారా?

నువ్వొస్తానంటే.. మేమొద్దంటామా? ప‌వ‌న్‌కు ప్ర‌కాశ్ చుర‌కే క‌రెక్టు..! అన‌వ‌స‌ర హైప్ ఇస్తున్నారా?
Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు… ఎవ‌రూ ఇవ్వ‌ని విధంగా చ‌మ‌త్కార‌పు చుర‌క‌లంటించాడు సినీ న‌టుడు ప్రకాశ్‌రాజ్‌. మొన్న‌టికి మొన్న ప‌వ‌న్‌.. నాగేశ్వ‌ర్‌లొల్లిలో నాగేశ్వ‌ర్ ప‌క్షం వ‌హించిన ప్ర‌కాశ్‌రాజ్..ప‌వ‌న్‌ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శించాడు. నాగేశ్వ‌ర్‌కు తోడు మేముంటామ‌ని అన్నాడు. ఎక్క‌డ రాజ‌కీయంగా ఏ సంఘ‌ట‌న జ‌రిగినా.. త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు.. ప్ర‌కాశ్‌. చాలా వ‌ర‌కు అత‌ను చెప్పేవి, మాట్లాడేవి.. లాజిక‌ల్‌గా ఉంటాయి. కానీ చాలా సంద‌ర్భాల్లో వివాదాలెదుర్కొంటూ ఉంటాయి. ప్ర‌ధానంగా త‌న నాస్తిక‌వాదంతో ఆయ‌న మాట్లాడే తీరు వ‌ల్ల అత‌ను హిందుత్వానికి వ్య‌తిరేకి.. అని బీజేపీ, ఆరెసెస్ నేత‌లు టార్గెట్ చేస్తూ ఉంటారు.

ఎవ‌రెన్ని తిట్టినా.. త‌న న‌మ్మ‌కం త‌న‌ద‌ని, త‌న సిద్దాంతాలు త‌న‌వ‌ని, దేవుడ్ని న‌మ్మ‌కూడ‌దని, శ్ర‌మ‌ను న‌మ్ముకోవాల‌ని సూచిస్తూ మ‌రింత అగ్నికి ఆజ్యం పోయ‌డం కూడా ప్ర‌కాశ్‌కు అల‌వాటు. ప‌వ‌న్ విష‌యంలో కూడా ఆయ‌న అలాగే స్పందించాడు. నువ్వొస్తానంటే మేమొద్దాంటామా? రా…. ర‌మ్మ‌ని తెలంగాణ త‌ర‌పును ఆహ్వానం ప‌లక‌డ‌మే కాదు.. నువ్వెలా వ‌స్తున్నావు? ఒంట‌రిగానా..? పొత్తా? ఉత్తుత్తినేనా..? బీజేపీతోనా…? అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ ప్ర‌శ్న‌లు సూటిగా, నేరుగా ప‌వ‌న్‌ను, ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వానికి, తెలంగాణ‌లోని బీజేపీకి అవి శరాఘాతాలుగా త‌గిలాయి. ప‌వ‌న్ మాట‌ల‌కు, వెనుకున్న కూట‌మి ఎత్తుల‌కు తెలంగాణ నేత‌లు చిత్త‌య్యార‌నే చెప్పాలి.

Advertisement

కూట‌మిలో ఉన్న పార్టీలు.. టీడీపీ, జ‌న‌సేన తెలంగాణ‌లో ఉనికిలోనే లేవు. బీజేపీ కూడా హైద‌రాబాద్‌లో కొన్ని ప్రాంతాలు మిన‌హాయించి పెద్ద‌గా ప్ర‌భావితం చూపే స్థితిలో లేదు. దీనికి ప‌వ‌న్ మాట్లాడిన మాట‌ల‌కు కౌంట‌ర్లిచ్చి అన‌వ‌స‌రంగా మ‌రింత హైప్‌ను పెంచారు. వారికి తెల‌య‌కుండానే ప‌వ‌న్‌, అత‌ని వెనుకున్న శ‌క్తుల ఉచ్చులో ఇరుక్కుపోయారు. అయ్య జాగీరా అన్నాడు. దీనికి కూడా అంతా వెంట‌నే స్పందించారు. అవును.. అవును.. మా అయ్య జాగీరే అంటూ కౌంట‌ర్లు పోటీలు ప‌డి మ‌రీ ఇచ్చారు. తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం రోజునే ఇక్కడ మీటింగు పెట్టుకోవాల‌నుకోవ‌డ‌మే పెద్ద వ్యూహ‌మ‌ని తెలుస్తూనే ఉంది. అనుమ‌తిని ఇవ్వ‌కున్నా.. కోర్టు మెట్లు ఎక్కాడంటేనే అదెంత ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌నే ఎత్తుగ‌డ దాని వెనుక దాగుందో అర్థ‌మ‌వుతూనే ఉంది.

కానీ ఆ రాజ‌కీయ వ్యూహాన్ని ప‌సిగ‌ట్ట‌లేని తెలంగాణ నేత‌లు, పార్టీల‌క‌తీతంగా.. ఒక్క‌ బీజేపీ మిన‌హాయించి.. అంతా ప‌వ‌న్ వేసిన పాచిక‌లో పావులా మారారు. దీని వెనుక ఉన్న కుట్ర‌ను ప్ర‌కాశ్ రాజ్ బాగానే క‌నిపెట్టాడు. అందుకే కొంచెం లేటైనా.. లేటెస్టుగానే స్పందించాడు. బీజేపీ, ఆరెసెస్ శ‌క్తుల‌ను ఎప్పుడూ వ్య‌తిరేకించే ప్ర‌కాశ్ రాజ్‌.. దీని నీడ‌లోనే ప‌వ‌ర్ అనుభవిస్తున్న ప‌వ‌న్ రాజ‌కీయంగా వేసే ప్ర‌తీ స్టెప్‌ను లోతుగా ప‌రిశీలిస్తున్నాడు. సినిమాల‌ ప‌రంగా చిరంజీవి అంటే విప‌రీత‌మైన అభిమానం ఉన్న ప్ర‌కాశ్ రాజ్‌కు.. రాజ‌కీయాల్లో మాత్రం త‌న సిద్దాంతాల‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఎవ‌రినీ వ‌ద‌లిపెట్ట‌డం లేదు.

Advertisement

ప‌వ‌నా, చంద్ర‌బాబా, మోడీనా.. ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ప‌వ‌న్ తాజా ఎపిసోడ్‌లో తెలంగాణ‌ నేత‌లంతా ఓ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే.. అందుకు భిన్నంగా చ‌మ‌త్కారంగా.. ప‌రిణ‌తితో, చుర‌క‌లంటించాడు ప్ర‌కాశ్‌రాజు. దీనిపై ఎవ‌రెన్ని కామెంట్లు చేసినా.. మ‌ళ్లీ స్పందించే అల‌వాటు అత‌నికి లేదు. చివ‌ర‌కు ప‌వ‌న్ స్పందించినా ప‌ట్టించుకోడు. అత‌నో మోనార్క్‌.. అంతే!

Related News

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

Big Stories

Advertisement
×