Peddi Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే కాకుండా, ఆ తర్వాత వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ఏ చిన్న అప్డేట్ వస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ అయితే రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ (Peddi Pre Release Business) ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరూ ఊహించని స్థాయిలో ‘పెద్ది’ బిజినెస్ క్లోజ్ అవుతుండటం చూసి ట్రేడ్ అనలిస్టులే షాక్ అవుతున్నారు.
Also Read- Nayan Sarika: ‘విష్ణు విన్యాసం’ వారికి ఫస్టాఫ్ బోర్ కొడుతుంది.. ఇదేంటి పుసుక్కున ఇలా చెప్పేసింది
సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాకి ఉండే క్రేజే వేరు. అలాంటి క్రేజ్ ఉన్న స్టార్‌కి ఒక పర్ఫెక్ట్ మాస్ సబ్జెక్ట్ పడితే బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ‘పెద్ది’ బిజినెస్ లెక్కలే నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు పోటీ పడుతున్నట్లుగా టాక్ నడుస్తుంది. గతంలో చరణ్ నటించిన ‘రంగస్థలం’ వంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ డ్రామా కావడంతో, ఈ సినిమాపై మాస్ ఆడియన్స్‌లో విపరీతమైన నమ్మకం ఉంది. ఏపీలోని సీడెడ్, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఈ సినిమా బిజినెస్ ఫిగర్స్ చూస్తుంటే, ఇది కేవలం సినిమా కాదు.. ఒక ప్రభంజనం అని అర్థమవుతోంది. కేవలం బిజినెస్ పరంగానే కాకుండా, కంటెంట్ పరంగా కూడా ‘పెద్ది’ గురించి వినిపిస్తున్న మాటలు మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి.
Also Read- Mokshagna Teja: ఆదిత్య 999తోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే!
ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం గురించి సినీ సర్కిల్స్‌లో ఒకటే టాక్ నడుస్తోంది.. ‘అవుట్‌పుట్ అదిరే లెవెల్‌లో వస్తోంది!’ అని. బుచ్చిబాబు సానా తన తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు చరణ్ లాంటి మాస్ పల్స్ తెలిసిన హీరోతో కలిసి చేస్తున్న ఈ ప్రయోగం పక్కాగా వర్కవుట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకి మరో పెద్ద ఎస్సెట్ కానుంది. ప్రస్తుతం నడుస్తున్న హైప్ చూస్తుంటే ‘పెద్ది’ ఓపెనింగ్స్ పరంగా పాత రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం ఏపీలోనే కాకుండా వరల్డ్ వైడ్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకి డిమాండ్ భారీగా ఉంది. సినిమా రిలీజ్ తర్వాత ఈ బజ్ అలాగే కొనసాగితే, బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. ఎందుకంటే, రామ్ చరణ్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉంది. చూద్దాం మరి.. ఏప్రిల్ 30న ఏం జరుగుతుందో?
Also Read- Sarkaar Season 6 Promo: అబ్బబ్బ.. ఏం పెట్టల్ని పట్టుకొచ్చార్రా! ఈసారి ర్యాంపేజ్ ఫిక్స్!