E-Paper
Advertisement

Mrithyunjay: ‘ఈ జిందగీ’.. ‘మృత్యుంజయ్’ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్స్!

Mrithyunjay: ‘ఈ జిందగీ’.. ‘మృత్యుంజయ్’ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్స్!
Advertisement

Mrithyunjay: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి విజయాలతో ఊపుమీదున్న శ్రీవిష్ణు నుంచి ఒక వారం గ్యాప్‌లో రెండు సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) కాగా, రెండోది ‘మృత్యుంజయ్’. ఇప్పటికే ‘విష్ణు విన్యాసం’ ప్రమోషన్స్ యమా జోరు మీద ఉండగా, తాజాగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ (Mrithyunjay) ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజాగా చిత్ర యూనిట్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. ఈ సినిమాలోని మొదటి పాట ‘ఈ జిందగీ’ (Ee Zindagi) పాటను బుధవారం విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read- Nayan Sarika: ‘విష్ణు విన్యాసం’ వారికి ఫస్టాఫ్ బోర్ కొడుతుంది.. ఇదేంటి పుసుక్కున ఇలా చెప్పేసింది

క్లాసీగా, సీరియస్ లుక్‌లో

Advertisement

ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీవిష్ణు చాలా క్లాసీగా, సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చొక్కా చేతులు మడుస్తూ.. ఏదో లోతైన ఆలోచనలో ఉన్న ఆయన స్టిల్ చూస్తుంటే, సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి. బ్లాక్ బస్టర్ హిట్ ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ మళ్ళీ ఈ సినిమాలో జంటగా నటిస్తుండటం విశేషం. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరోసారి మ్యాజిక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు.

Also Read- Horror Comedy OTT : ముగ్గురు స్నేహితులను ముప్పుతిప్పలు పెట్టే ఆత్మ… ఓటీటీలోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ మూవీ

మార్చి 6న థియేటర్లలోకి..

Advertisement

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ ఉంది. ఈ సినిమాను మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ్యూజిక్ ప్రమోషన్స్‌తో మొదలైన ఈ సందడి, రిలీజ్ వరకు సినిమాపై మరింత హైప్‌ను పెంచడం ఖాయం. శ్రీవిష్ణు అనగానే కంటెంట్ పరంగా కింగ్ కాబట్టి.. శ్రీవిష్ణు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదలకు ముందే భారీగా లాభాలను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు, బిజినెస్ చెబుతున్నాయి. మరి ‘మృత్యుంజయ్’ కూడా పేరుకు తగ్గట్టే కలెక్షన్లతో పాటు రికార్డులను కూడా క్రియేట్ చేస్తుందేమో చూద్దాం..

Also Read- Up Coming Movies : ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోకి రానున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఇవే… అక్యూస్డ్ నుండి ది కేరళ స్టోరీ 2 వరకు

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×