E-Paper
Advertisement

Poonam Kaur: పవన్ కళ్యాణ్ పరువు తీసిన పూనమ్.. ఈ సారి ఏకంగా మతం పేరుతో!

Poonam Kaur: పవన్ కళ్యాణ్ పరువు తీసిన పూనమ్.. ఈ సారి ఏకంగా మతం పేరుతో!
Advertisement

Poonam Kaur:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాయాజాలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్(Poonam Kaur) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) లను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు గుప్పిస్తోంది.. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఏకంగా మా అసోసియేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. తనను, తన జీవితాన్ని నాశనం చేశారని, అవకాశాలు రాకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అలాంటి ఈమె మళ్లీ ఇప్పుడు మతం పేరుతో పవన్ కళ్యాణ్ పరువు తీసింది. పవన్ కళ్యాణ్ అంటేనే ఫేక్ అన్నట్టు పూనమ్ కామెంట్లు చేసిందని అభిమానులు మండిపడుతున్నారు.. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పవన్ కళ్యాణ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఫేక్ సింగ్ నిలబడలేరు..

అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదే సమయంలో ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్ రణవీర్ సింగ్ హీరోగా ‘ధురంధర్: ది రివేంజ్’ అటు హిందీ తో పాటు ఇటు తెలుగులో డబ్బింగ్ వర్షన్లో రిలీజ్ అయింది. అయితే ఈ రెండు చిత్రాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే . ఇప్పుడు ఇదే విషయంపై ప్రముఖ నటి పూనమ్ కామెంట్లు చేసింది.” జస్క్రిత్ సింగ్ రంగీ, ది రియల్ సింగ్, స్టోరీ ఆఫ్ రియల్ హీరో.. ధురంధర్ 2 చూసేందుకు నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను.. నో ఫేక్ సింగ్ వుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ బాక్స్ ఆఫీస్ ( ఈ సినిమా ముందు ఎలాంటి నకిలీ సింగ్ బాక్సాఫీస్ వద్ద నిలబడలేడు) ” అంటూ ఆమె ట్వీట్ చేసింది.

Advertisement

ALSO READ:Big TV Kissik Talks: రియాలిటీ షోల వెనుక ఇంత కుట్రా.. పీఆర్ టీమ్ లోగుట్టులు బయటపెట్టిన శ్రీ సత్య!

పూనమ్ పై మండిపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు..

ఇకపోతే పూనమ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. కానీ కింద కామెంట్ లో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. వాస్తవానికి గత కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన అధికారిక పర్యటనలో భాగంగా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ సిక్కు మతస్థులతో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా ఆయన సిక్కు గెటప్ లో కనిపించారు. ఈ క్రమంలోనే ఆమె ఫేక్ సిక్ అంటూ పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా ప్రస్తావించింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే పూనం సిక్కు కమ్యూనిటీకి చెందిన మహిళ అన్న విషయం అందరికీ తెలిసిందే .ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ను ఈసారి ఏకంగా మతం పేరుతో ఆయన పరువు తీసింది అని నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరి దీనిపై పూనమ్ మళ్ళీ స్పందిస్తుందేమో చూడాలి ..ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈమె.. తన తదుపరి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నారు.

Advertisement

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×