E-Paper
Advertisement

Couple friendly: కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని ఆ సినిమాతో పోల్చిన ప్రభాస్.. అదో మైలురాయి అంటూ!

Couple friendly: కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని ఆ సినిమాతో పోల్చిన ప్రభాస్.. అదో మైలురాయి అంటూ!
Advertisement

Couple friendly:పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ (Prabhas) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సాధారణంగా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతూ అప్పుడప్పుడు తన సినిమా ఈవెంట్లలో కనిపించే ప్రభాస్.. ఈమధ్య కాలంలో పక్క సినిమాలపై కూడా ప్రశంసలు కురిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఒక చిన్న సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా తన కెరియర్లో తనకు బ్లాక్ మాస్టర్ విజయాన్ని అందించిన చిత్రంతో పోలుస్తూ కామెంట్లు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ చిత్రం ఏదో కాదు సంతోష్ శోభన్(Santhosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) కాంబినేషన్లో వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ.

కపుల్ ఫ్రెండ్లీపై ప్రభాస్ ప్రశంసలు..

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిన్న సినిమాగా వచ్చినా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి అటు యువతను, ఇటు జంటలను మెప్పిస్తోంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సంతోష్ నటించిన సినిమా కావడంతో అభిమానులలో కూడా ఆసక్తి నెలకొంది అని చెప్పవచ్చు. జీవితంపై పెద్దగా ఆశలు లేకుండా సాదాసీదాగా గడిపే ఒక యువకుడి జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించడం.. ఇద్దరు ఒకే ఇంట్లో గడపాల్సిన రావడం.. ఆ తర్వాత వారి జీవితాలలో చోటు చేసుకునే పరిణామాలు ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇలా రాసుకు వచ్చారు

నాకు వర్షం ఎలాగో.. సంతోష్ కి ఫ్రెండ్లీ కపుల్ అలాగా..

Advertisement

“కపుల్ ఫ్రెండ్లీ.. ఇదొక లవ్లీ అండ్ బ్యూటిఫుల్ ఫిలిం.. ఈ సినిమాను చూసి చాలా ఎంజాయ్ చేశాను. సంతోష్, మానస వారణాసి జంట తెరపై చాలా అద్భుతంగా కనిపించింది. దర్శకుడు అశ్విన్ ఎంతో ప్రతిభతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి కథను వెండితెరపైకి తీసుకువచ్చిన నిర్మాతలకు అభినందనల. నాకు వర్షం సినిమా ఎంత ప్రత్యేకమో.. సంతోష్ శోభన్ కి కపుల్ ఫ్రెండ్లీ కూడా అంతే ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా సంతోష్ కెరియర్ లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది ” అంటూ ప్రభాస్ రాసుకు వచ్చారు. ఇక ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ సినిమా టీం కి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి.

ALSO READ:Tollywood: కపుల్ ఫ్రెండ్లీ ఎఫెక్ట్.. ఫిబ్రవరి 14 టార్గెట్ అంటున్న మేకర్స్..

ప్రభాస్ కామెంట్స్.. అదనపు బోనస్..

Advertisement

ఒక సినిమా విషయానికి వస్తే అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో.. యువి క్రియేషన్స్ సమర్పణలో యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ పై తెలుగు, తమిళ్ భాషలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆదిత్య రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని విడుదల చేశారు. చిన్న సినిమాను అయినా కంటెంట్ పరంగా ఆకట్టుకోవడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నట్లు సమాచారం. పైగా ఇలాంటి చిన్న చిత్రానికి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మద్దతు పలకడంతో కలెక్షన్లు మరింత జోరుగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏది ఏమైనా సంతోష్ శోభన్ మూవీకి ప్రభాస్ ప్రశంసలు అదనపు బోనస్గా కనిపిస్తున్నాయి.

Related News

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

Big Stories

Advertisement
×