E-Paper
Advertisement

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు
Advertisement

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, రాష్ట్ర ఆదాయ వనరులు పెరగాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆ పరమశివుడిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రపంచంతో పోటీపడే స్థాయికి తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల సంక్షేమం – ప్రకృతి వైపరీత్యాల నివారణ

Advertisement

రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ.. లోక కల్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు భట్టి పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని.. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా రాష్ట్రం పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు చెప్పారు. భక్తుల నమ్మకానికి నిలయమైన స్నానాల లక్ష్మీపురంలోని వైరా నదిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన గుర్తుచేశారు.

ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన

Advertisement

స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న స్నానాల ఘాట్, కళ్యాణ మండపం, రథశాల, వైరా నది రిటైనింగ్ వాల్ పనులను ఆయన నిశితంగా గమనించారు. అక్కడ నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ భవిష్యత్తులో స్థానిక 50 వేల మంది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భక్తులతో ఆత్మీయ పలకరింపులు

మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, వివిధ స్టాల్స్‌ను భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా తిరునాళ్లకు వచ్చిన భక్తులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన భక్తులతో చిరునవ్వుతో ఫొటోలు దిగి వారిని ఉత్సాహపరిచారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

Also Read: మహాశివరాత్రి వేళ మారణహోమం.. ఆటోలో వచ్చి అడ్డగించి.. కర్రలతో కొట్టి..!

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×