E-Paper
Advertisement

ప్రభాస్ సినిమా పై నోరు పారేసుకున్న కమెడియన్ సప్తగిరి.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్!

ప్రభాస్ సినిమా పై నోరు పారేసుకున్న కమెడియన్ సప్తగిరి.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్!
Advertisement

Comedian Sapthagiri: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో కమెడియన్స్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా కమెడియన్ గా గుర్తింపు పొందిన సప్తగిరి గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సప్తగిరి ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇక ఈయన కమెడియన్ గా మాత్రమే కాకుండా, హీరోగా కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సప్తగిరి నటించిన “పురుషః” (Purushaha)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మే 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కమెడియన్ సప్తగిరి(Sapthagiri) చేసిన కామెంట్స్ ప్రభాస్(Prabhas) అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కమెడియన్ సప్తగిరిని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ ఈయనపై ఫైర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే.. పురుష సినిమా కార్యక్రమంలో భాగంగా సప్తగిరి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 18 సంవత్సరాలు అయింది. నేను ఇదివరకే నటించిన పాత్రలలోనే మళ్లీ మళ్లీ నటిస్తున్నాను అందుకే కొత్త తరహా పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.

రాజా సాబ్ చిన్న సినిమా…

Advertisement

ఆర్థికంగా తాను ఇప్పుడు బాగా స్థిరపడ్డానని అందుకే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మంచి కథల కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే ఇటీవల తాను సరస్వతి, ది రాజా సాబ్, కొక్కొరొకో అని సినిమాలలో నటించాను అయితే ఇవన్నీ చిన్న సినిమాలు కావడంతో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ అవ్వలేదు అందుకే తన పాత్రలకు కూడా గుర్తింపు రాలేదని సప్తగిరి తెలిపారు. ఇలా రాజా సాబ్ (Raaja Saab) సినిమాని చిన్న సినిమా అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Advertisement

ప్రభాస్ నటించిన ఈ సినిమా దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలాంటి ఒక పాన్ ఇండియా సినిమాని పట్టుకొని చిన్న సినిమా అంటూ ఈయన మాట్లాడటంతో కచ్చితంగా ఇది ప్రభాస్ ను అవమానించడమే అంటూ ప్రభాస్ అభిమానులు సప్తగిరిని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. రాజా సాబ్ సినిమా సమయంలో ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్లను రాబడుతుంది అంటూ గొప్పలు చెప్పిన సప్తగిరి ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో చిన్న సినిమా అంటూ అవమానకరంగా మాట్లాడటం సరైనది కాదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ప్రభాస్ సినిమా పై నోరు పారేసుకున్న కమెడియన్ సప్తగిరి.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×