E-Paper
Advertisement

ప్రీమియం SUV మార్కెట్లోకి కొత్త స్కోడా కోడియాక్ ఎంట్రీ, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ప్రీమియం SUV మార్కెట్లోకి కొత్త స్కోడా కోడియాక్ ఎంట్రీ, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

2026 Skoda Kodiaq Launched in India: ప్రముఖ ఆటో మోబైల్ సంస్థ స్కోడా ఆటో భారతీయ మార్కెట్ లోకి ఫ్లాగ్‌ షిప్ SUV స్కోడా కొడియాన్ ను కొత్త అప్‌ డేట్లతో విడుదల చేసింది. 2026 మోడల్‌ గా వచ్చిన ఈ SUVలో డిజైన్, ఫీచర్లు, భద్రతా టెక్నాలజీలో కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా ప్రీమియం SUV కొనాలనుకునే కస్టమర్లను ఆకట్టుకునేలా కంపెనీ ఈ కొత్త కోడియాక్‌ ను మరింత మోడ్రన్ గా తీర్చిదిద్దింది.

రూ.36.99 లక్షల ప్రారంభం ధరతో..

కొత్త కోడియాక్ ప్రారంభ ధర రూ.36.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది లౌంజ్ 5 సీటర్ వేరియంట్‌ కు వర్తిస్తుంది. స్పోర్ట్‌ లైన్ 7-సీటర్ వేరియంట్ ధర రూ.44.99 లక్షలు కాగా, టాప్ ఎండ్ సెలక్షన్ L&K 7 సీటర్ వేరియంట్ ధర రూ.46.99 లక్షలుగా ఫిక్స్ చేసింది. ఈ SUVను కుటుంబ అవసరాలు, లాంగ్ డ్రైవ్‌లు, ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

Advertisement

ఇక లౌంజ్ వేరియంట్‌ లో 5 సీట్ల అమరికతో పాటు 786 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లే వారికి  ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వేరియంట్‌ లో కూడా కంపెనీ ప్రధాన మెకానికల్ ఫీచర్లను అందించింది. ఇందులో 2.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్, 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్, 4X4 డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి.

ఆకట్టుకునే అత్యాధునిక ఫీచర్లు

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, గ్రే స్వీడిష్ అప్‌హోల్స్టరీ, పనోరమిక్ సన్‌ రూఫ్, లెదర్ స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ టచ్ ఇంటీరియర్స్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కారు కేబిన్ మరింత లగ్జరీ ఫీల్‌ ను ఇస్తుంది. ఈసారి కోడియాక్‌ లో వచ్చిన పెద్ద అప్‌ డేట్ ADAS టెక్నాలజీ. స్కోడా ADAS ఫీచర్లను అందిస్తున్న తొలి భారత మోడల్ ఇదే కావడం విశేషం. లెవెల్ 2 ADASను స్పోర్ట్‌ లైన్, సెలక్షన్ L&K వేరియంట్లలో అందిస్తున్నారు. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, ఫ్రంట్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రియర్ ట్రాఫిక్ అలర్ట్ లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. హైవే మీద డ్రైవింగ్‌ ను మరింత సురక్షితంగా మార్చేందుకు ఉపయోగపడతాయి.

Advertisement

ఇక LED మ్యాట్రిక్స్ హెడ్‌ లైట్లు, అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి. రాత్రి సమయంలో డ్రైవింగ్‌ కు మంచి విజిబిలిటీ ఇస్తాయి. స్పోర్ట్‌ లైన్ వేరియంట్‌ లో 360 డిగ్రీ కెమెరా, ఇంటెలిజెంట్ పార్క్ అసిస్ట్ లాంటి  ఫీచర్లు కూడా ఉన్నాయి. పార్కింగ్ మరింత సులభంగా మారుతుంది. టాప్ ఎండ్ సెలక్షన్ L&K వేరియంట్‌ లో లగ్జరీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. కాగ్నాక్ లెదర్ సీట్లు, మసాజ్ ఫంక్షన్, వెంటిలేషన్, హీటెడ్ సీట్లు, పవర్ అడ్జస్ట్‌ మెంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లొచ్చు.

ఇంజిన్ గురించి..

ఇక ఈ మోడల్ కు సంబంధించి అన్ని వేరియంట్లలో ఒకే 2.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ ఉపయోగించారు. ఈ కారు 201 bhp పవర్, 320 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఉంటుంది. 4X4 డ్రైవ్ సిస్టమ్ ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉంటుంది.

Read Also: టాటా To కియా.. 2026లో లాంచ్ కానున్న 7 సీట్ల SUVలు ఇవే!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×