E-Paper
Advertisement

Prabhas: బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. చిరంజీవి బాటలోనేనా?

Prabhas: బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. చిరంజీవి బాటలోనేనా?
Advertisement

Prabhas: ఇటీవల టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమా వ్యూహాలపై ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. సాధారణంగా ఒక సూపర్ స్టార్ సినిమా పూర్తయితే ముందుగా అదే సినిమాను రిలీజ్ చేసి, తర్వాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెడతారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించారు. ఆయన నటించిన విశ్వంభర సినిమా షూటింగ్, ప్రొడక్షన్ పూర్తయినా..దాన్ని కొంతకాలం పక్కన పెట్టారు. ఆ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో చేసిన సినిమాను ముందుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం బాక్సాఫీస్ విజయమే. అనిల్ రావిపూడి సినిమాలు కమర్షియల్‌గా మంచి ఫలితాలు ఇస్తాయన్న నమ్మకం చిరంజీవికి ఉంది. అదే నమ్మకంతో తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా మారి, చిరంజీవికి మళ్లీ గట్టి బాక్సాఫీస్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది.

Advertisement

ఇప్పుడు ఇదే తరహా వ్యూహాన్ని ప్రభాస్ కూడా అనుసరిస్తున్నాడా అనే చర్చ మొదలైంది. ప్రభాస్ ముందుగా ఫౌజీ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. లాజిక్ ప్రకారం అదే సినిమా ముందుగా రిలీజ్ కావాలి. కానీ పరిస్థితులు మారాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాను ముందుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వచ్చే ఏడాది మార్చిలో సినిమా రిలీజ్ అని మేకర్స్ స్పష్టత ఇచ్చారు.

ఈ మార్పు వెనుక కూడా బాక్సాఫీస్ లెక్కలే ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల వచ్చిన రాజా సాబ్ సినిమా ప్రభాస్‌కు ఆశించిన స్థాయిలో పేరు తీసుకురాలేదు. ముఖ్యంగా లుక్స్, బాడీ డబుల్స్ వాడకం, ఎగ్జిక్యూషన్‌పై విమర్శలు వచ్చాయి. అందుకే ప్రభాస్ ఇప్పుడు తన ఇమేజ్‌ను మళ్లీ బలంగా నిలబెట్టేందుకు స్పిరిట్‌ను కీలక సినిమాగా చూస్తున్నారని టాక్.

Advertisement

చిరంజీవి ఎలా అయితే విశ్వంభరను పక్కన పెట్టి మరో సినిమాతో ముందుకు వెళ్లారో..అలాగే ప్రభాస్ కూడా ఫౌజీని వెనక్కి నెట్టి స్పిరిట్‌ను ముందుకు తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రభాస్‌కు ఒక ట్రంప్ కార్డ్ లాంటిదిగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మీదే ఉంది. ఈ సినిమాతో ప్రభాస్‌కు గట్టి కంబ్యాక్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

ALSO READ: NBK 111: ముంబై డాన్ గా బాలయ్య..NBK 111 కొత్త స్టోరీ ఇదే.. హీరోయిన్ గా నయన్ ఫిక్స్?

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×