E-Paper
Advertisement

Collagen rich fruits: చర్మం మెరిసిపోవాలంటే కొలాజన్ పెంచే ఈ పండ్లు తినండి

Collagen rich fruits: చర్మం మెరిసిపోవాలంటే కొలాజన్ పెంచే ఈ పండ్లు తినండి
Advertisement

మెరిసే చర్మం కావాలని అందరికీ ఉంటుంది. ఇందుకోసం క్రీములు, సీరమ్స్ వంటివి వాడే వారి సంఖ్య ఎక్కువైపోయింది. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం చర్మానికి నిజమైన అందం లోపలి నుంచే వస్తుంది. అలా రావాలంటే అందుకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా కొలాజెన్ పెంచే ఆహారాన్ని తినాల్సిన అవసరం ఉంది. శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతే చర్మం ముడతలు పడిపోతుంది, కాంతి హీనంగా మారుతుంది. కాబట్టి కొలాజెన్ అధికంగా ఉండే కొన్ని పండ్లను ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి. కొలాజెన్ అనేది శరీరంలో సహజంగా తయారయ్యే ఒక ప్రోటీన్. ఇది చర్మం, జుట్టు, గోళ్లు, ఎముకలు బలంగా ఉండేందుకు అవసరం. ముఖ్యంగా చర్మాన్ని మెరిపించేది ఈ కొలాజనే. సరైన ఆహారం తీసుకుంటే శరీరం తనకు తానే కొలాజెన్ తయారు చేసుకుంటుంది. అందుకోసం విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినాలి.

నారింజ
నారింజలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ కొలాజెన్ తయారీలో అత్యంత అవసరమైనది. రోజూ ఒక నారింజ తినడం లేదా నారింజ జ్యూస్ తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారిపోతుంది.

Advertisement

బొప్పాయి
చర్మానికి బొప్పాయి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు పపైన్ ఎంజైమ్ ఉంటుంది. చర్మంలోని మృత కణాలను తొలగించి కొత్త కణాల పెరుగుదలకు ఇది ఎంతో అవసరం. దీనివల్ల చర్మం కూడా మృదువుగా మారుతుంది. బొప్పాయి తినడం వల్ల మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.

Also read: Acne: మొటిమలు తగ్గాలంటే వేపాకులు, ఉసిరిని ఇలా వాడేయండి

Advertisement

స్ట్రాబెర్రీలు
స్ట్రాబెరీలు కొలెజెన్ కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చర్మంలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఇవి కాపాడతాయి. కొలాజెన్ నశించకుండా పెరిగేలా స్ట్రాబెర్రీస్ సహకరిస్తాయి. తరచూ స్ట్రాబెరీస్ తినే వారిలో చర్మం మెరిసిపోతూ ఉంటుంది.

కివి పండు
కివి పండులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. నారింజ కంటే కివిలోనే ఎక్కువగా ఉంటుందని చెబుతారు. కివి తినడం వల్ల శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి కూడా వేగంగా పెరుగుతుంది. సూర్యకిరణాల నుంచి వచ్చే వేడి వల్ల చర్మం నష్టపోకుండా కాపాడడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.

Also read: Viral News: పెళ్లి చేసుకుంటే రూ.12 లక్షలు, పిల్లలు పుడితే రెట్టింపు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్

దానిమ్మ
దానిమ్మ చర్మానికి ఫ్రెండ్ అనే చెప్పాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాని లోపల నుంచి రక్షిస్తాయి. దానిమ్మ తినడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగ్గా జరుగుతుంది. దానివల్ల చర్మానికి అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ కూడా అంది చర్మం మెరిసిపోతూ ఉంటుంది.

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×