E-Paper
Advertisement

Prabhas Spirit Look: జపాన్‌లో ప్రభాస్‌ సందడి.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న ‘స్పిరిట్’ లుక్‌!

Prabhas Spirit Look: జపాన్‌లో ప్రభాస్‌ సందడి.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న ‘స్పిరిట్’ లుక్‌!
Advertisement

Prabhas Spirit Look: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడనేది చాలా గోప్యంగా ఉంచుతున్నాడు. సినిమాల ప్రకటన అయితే చేస్తున్నాడు. కానీ, ఎప్పుడు ఏ మూవీ సెట్‌లో ఉంటున్నాడనేది అసలు బయటకు రావడం లేదు. ఇటీవల సందీప్‌ రెడ్డి వంగాతో చేయబోతున్న స్పిరిట్‌ మూవీని లాంచ్‌ గ్రాండ్‌ జరిగింది. అంటే ఈ సినిమా షూటింగ్‌ మొదలు పట్టేశాడని వెల్లడైంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ మూవీ షూటింగ్‌తో పాటు స్పిరిట్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్‌ తాజాగా జపాన్‌ వెళ్లాడు.

జపాన్‌లో ప్రభాస్‌ సందడి

బాహుబలి: ది ఎపిక్‌ రిలీజ్‌ సందర్భంగా డార్లింగ్ జపాన్‌లో సందడి చేస్తున్నాడు. బాహుబలి రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్‌ పేరుతో ఇటీవల ఇండియాలో విడుదల చేయగా దీనికి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. రీ రిలీజ్ లోనూ ఈ చిత్రం దుమ్మురేపింది. సుమారు రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు వసూళ్లు చేసినట్టు ట్రేడ్‌ వర్గాల అంచన. అయితే ఇప్పుడు ఈ సినిమాను జపాన్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్‌ 12న ఈ మూవీ జపాన్‌ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇవాళ, రేపు స్పెషల్‌ షోలు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభాస్‌ ప్రమోషన్స్‌ కోసం జపాన్‌ వెళ్లాడు.

Advertisement

Also Read: The Great Pre Wedding Show OTT: ఓటీటీకి వచ్చేసిన ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

కొత్త లుక్‌తో ఫిదా చేస్తున్న డార్లింగ్‌

ఈ మూవీ స్క్రినింగ్‌ అవుతున్న థియేటర్లకు వెళ్లి.. ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు. అక్కడ వారితో కాసేపు ముచ్చటించి వారితో కలిసి సినిమా చూసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇక్కడ ప్రభాస్‌ లుక్‌ చూసికి ఫ్యాన్స్‌ అంత ఫిదా అవుతున్నారు. ఇందులో డార్లింగ్‌ స్టైలిష్‌గా కనిపించాడు. డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌, డిజైనర్‌ అవుట్‌ ఫిట్‌ డార్లింగ్‌ కనువిందు చేస్తున్నాడు. అయితే ఇది స్పిరిట్‌ మూవీ లుక్‌ అర్థమైపోతుంది. సినిమా ఏదైనా మా డార్లింగ్స్ లుక్స్ మాత్రం కేక అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఈ మధ్యే స్పిరిట్‌ మూవీ షూటింగ్‌ మొదలైంది. ప్రభాస్ ఈ కొత్త లుక్ చూస్తుంటే ఇది స్పిరిట్‌ కోసమే అని అంతా ఫిక్స్‌ అయిపోతున్నారు.

Advertisement

స్పిరిట్ షూటింగ్ తో బిజీ

ఒకవేళ ఇదే ఆ మూవీ లుక్‌ అయితే మాత్రం స్పిరిట్‌ మూవీ అదిరిపోవడం ఖాయమంటూ నెటిజన్స్‌, ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్‌ లేటెస్ట్‌ లుక్‌ మాత్రం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.అలాగే ఫౌజీ, స్పిరిట్‌ తో పాటు ది రాజా సాబ్‌, సలార్‌ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైన్‌లో ఉ న్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్‌ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 9న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషనల్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. మరోవైపు సలార్‌ 2, కల్కి 2 సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకుంటున్నాయి. ఫౌజీ, స్పిరిట్‌ చిత్రాల తర్వాత కల్కి 2 మూవీ షూటింగ్‌ని మొదలు పెట్టనున్నాడు డార్లింగ్.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×