E-Paper
Advertisement

Meta Smart Glasses: మెటా నుంచి తొలి స్మార్ట్ గ్లాసెస్.. 12MP కెమెరా, 48 గంటల బ్యాటరీ, అధునాతన పీచర్లతో లాంచ్!

Meta Smart Glasses: మెటా నుంచి తొలి స్మార్ట్ గ్లాసెస్.. 12MP కెమెరా, 48 గంటల బ్యాటరీ, అధునాతన పీచర్లతో లాంచ్!
Advertisement

Meta Smart Glasses: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో వచ్చిన మొట్టమొదటి ‘ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్’ ప్రస్తుతం భారత్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీనిని ప్రముఖ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థ ఓక్లీ భాగస్వామ్యంతో మెటా తీసుకొచ్చింది. ఈ గ్లాసెస్‌తో తీసే వీడియోలు, ఫొటోలు హై-క్వాలిటీగా ఉంటాయని సంస్థ తెలిపింది. అంతేకాదు.. దీనిలోని వాయిస్ అసిస్టెంట్ ద్వారా అనేక పనులు సులభంగా చేసేయొచ్చట. రండి.. మెటా స్మార్ట్ గ్లాసెస్ ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ధర ఎంతంటే?

కృత్రిమ మేధ సపోర్ట్‌తో నడిచే.. మెటా తీసుకొచ్చిన మెటా ఓక్లీ మెటా HSTN గ్లాసెస్ ప్రారంభ ధర రూ.41,800. ఈ ధర క్లియర్, ప్రిజమ్ వేరియంట్లకు వర్తిస్తుంది. ప్రిజమ్ పోలరైజ్డ్ లెన్స్ ఉన్న మోడల్ ధర రూ.44,200. ప్రిజమ్ ట్రాన్సిషన్ లెన్స్ ఉన్న గ్లాసెస్‌ రూ.47,600 ధరకు అందుబాటులో ఉంది. భారత్‌లోని అన్ని ప్రముఖ ఆప్టికల్, ఐవేర్ రిటైలర్లు, సన్‌గ్లాస్ స్టోర్లలో వీటిని అమ్మకానికి పెట్టారు.

Advertisement

Read Also: మెసేజింగ్ యాప్స్‌కు కేంద్రం ఆదేశాలు.. సిమ్‌ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!

అద్భుతమైన ఫీచర్లు..

ఈ స్మార్ట్ గ్లాసెస్‌ 12MP కెమెరా కలిగి ఉండటంతో.. ఇది 3కే వీడియో రిజల్యూషన్‌లో సెకనుకు 30 ఫ్రేమ్‌ల వేగంతో వీడియోలను రికార్డు చేస్తుంది. అలాగే ఓక్లీ మోటా స్మార్ట్ గ్లాసెస్ వీడియో రికార్డింగ్ కోసం దీనిలో స్టాండర్డ్, స్లో మోషన్, హైపర్‌లాప్స్ వంటి మోడ్‌లను కూడా కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్‌తో యూజర్లు 3024 x 4032 పిక్సెల్స్ రిజల్యూషన్‌లో ఫొటొలు తీయొచ్చు. వీటిలో ఉన్న ప్రత్యేక పెంటా మైక్రోఫోన్.. ఆడియోను స్పష్టంగా రికార్డు చేస్తుంది. కాల్స్ మాట్లాడుకోవడానికి, సాంగ్స్ వినడానికి ఓపెన్ ఇయర్ స్పీకర్లను అమర్చారు. ఇన్‌స్టాగ్రామ్ లాంటి మెటా యాప్‌ల ద్వారా ఫస్ట్‌ పర్సన్ లైవ్‌స్ట్రీమింగ్ చేసే సౌలభ్యం కూడా ఈ గ్లాసెస్‌ కలిగి ఉంది.

AI అసిస్టెంట్ వాయిస్:

Advertisement

ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్.. 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఇది 30 సెకన్ల నిడివి ఉన్న 100 వీడియోలకు, 1,000 కంటే ఎక్కువ ఫొటోలకు సరిపోతుందని సంస్థ తెలిపింది. అలాగే ‘Hey Meta’ అనే వాయిస్ కమాండ్ సహాయంతో మెటా ఏఐ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంతో వాతావరణ సమాచారం, ప్లానింగ్, వంట చిట్కాలు లాంటివి అడిగి తెలుసుకోవచ్చు. అలాగే యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై లాంటి వాటితో ఇది అనుసంధానం కావడంతో సాంగ్్ కూడా వినవచ్చు.

48 గంటల ఛార్జింగ్:‌

ఈ స్మార్ట్ గ్లాసెస్‌కు ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. దాదాపు ఎనిమిది గంటల వరకు పనిచేస్తాయి. వీటితో పాటు రీఛార్జ్ చేయగలిగే కేస్‌ కూడా వస్తుంది. దీని నుంచి గ్లాసెస్‌ను ఛార్జ్ చేయడం ద్వారా మొత్తం 48 గంటల వరకు వాడుకోవచ్చని మెటా వెల్లడించింది.

Read Also: ఏముందీ షియోమీ స్మార్ట్ వాచ్.. 18 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్లోకి కొత్త సరుకు!

Related News

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

Big Stories

Advertisement
×