E-Paper
Advertisement

Prabhas Upcoming Movie : ఇక ఆ ప్రభాస్ సినిమా రెండేళ్ల పాటు విడుదల కాదా..?

Prabhas Upcoming Movie : ఇక ఆ ప్రభాస్ సినిమా రెండేళ్ల పాటు విడుదల కాదా..?
Advertisement

Prabhas Upcoming Movie: ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి రెండు భారీ సినిమాలపై పని చేస్తున్నారు. ఒకటి ఫౌజీ.. మరొకటి స్పిరిట్. రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. బారీ బడ్జెట్..బారీ అంచనాలు ఉండటంతో ఈ రెండు సినిమాలు ప్రభాస్‌కు అవకాశంగా ఉండటంతో పాటు సమస్యగా కూడా మారుతున్నాయి.

ముందుగా రాజా సాబ్ సినిమా ఆలస్యం కావడంతో ప్రభాస్ షెడ్యూల్స్ గందరగోళంగా మారాయి. దాని ప్రభావం ఫౌజీ సినిమా మీద కూడా పడింది. అనుకున్న టైమ్‌కు షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు రాజా సాబ్ విడుదల అయ్యి ఫలితం తెలిసిన తర్వాత అందరి దృష్టి స్పిరిట్ మీద పడింది.

Advertisement

ఇటీవల స్పిరిట్ విడుదల తేదీ ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా షూటింగ్ మొదలై ఎక్కువ కాలం కాకముందే 2027 మార్చి 5న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే సగం షూటింగ్ పూర్తైన ఫౌజీకి మాత్రం ఇంకా విడుదల తేదీ చెప్పలేదు. వాయిదా వేస్తున్నామని కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీనితో ఫౌజీ భవిష్యత్తుపై స్పష్టత లేకుండా పోయింది.

వచ్చిన సమాచారం ప్రకారం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ స్పిరిట్ మీదే పూర్తిగా ఫోకస్ చేయాలని కోరుతున్నారట. స్పిరిట్‌లో ప్రభాస్ లుక్ పూర్తిగా భిన్నంగా ఉండటంతో ఒకేసారి రెండు సినిమాలు చేయడం కష్టం అవుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే ఫౌజీ షూటింగ్ మరింత ఆలస్యం కావచ్చు.

Advertisement

ఇప్పటికే అభిమానులు గందరగోళంలో ఉన్నారు. ఫౌజీ టీమ్ ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ అందుకు ప్రభాస్ డేట్స్ కీలకం. ఆయన నుంచి పూర్తి సహకారం లభిస్తేనే ప్లాన్ ముందుకు వెళ్తుంది.
కొన్ని రూమర్స్ ప్రకారం ఫౌజీ సినిమా 2028కి వెళ్లొచ్చని అంటున్నారు. ఇది కాస్త అతిశయోక్తిగా అనిపిస్తున్నా పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. ఈ సినిమా ఇప్పటికే మొదలయ్యి దాదాపు ఒక సంవత్సరం పైనే అవుతుంది. ఇక ఇది నిజమే అయితే.. ఈ సినిమా షూటింగ్ నుంచి విడుదల తేదీకి మధ్య ఏకంగా.. నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టు ఉంటుంది.

బాహుబలి సినిమా కూడా ప్రభాస్కి ఐదేళ్లు పట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు హను రాఘవపూడి చిత్రం కూడా అదే ఐదేళ్లు పడేలా ఉంది. ఇదిలా ఉంటే మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న.‌సలార్ 2 .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2 టీమ్‌లు కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక వీటికి కూడా ప్రభాస్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రభాస్ మాత్రం అన్నిటికన్నా ముందు సందీప్ రెడ్డి వంగ.. స్పిరిట్ సినిమాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అర్థమవుతోంది. మరి ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి విషయం అందిస్తుందో వేచి చూడాలి.

ALSO READ: Ashika Ranganath : వైట్ డ్రెస్ లో మతిపోగొడుతున్న ఆషిక..రెండు కళ్లు చాలట్లే..!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×