E-Paper
Advertisement

Prabhas Salaar 2 : త్వరలోనే సలార్2.. ఎందుకయ్యా ఆశలు పెడుతున్నారు?

Prabhas Salaar 2 : త్వరలోనే సలార్2.. ఎందుకయ్యా ఆశలు పెడుతున్నారు?
Advertisement

Prabhas Salaar 2 Update : ఈ డిసెంబర్ 22న ఇండస్ట్రీ మొత్తం సలార్ నామస్మరణతో నిండిపోయింది. ఎక్కడ చూసిన సలార్ పోస్టర్లే కనిపించాయి. ప్రభాస్ పేరే వినిపించింది. కారణం… ఆ డేట్‌తో సలార్ సినిమా వచ్చి రెండేళ్లు అయింది. అందుకే ఆ హాడావుడి కనిపించింది. ఈ నేపథ్యంలో సలార్ నిర్మాతలు నిన్న ఓ అప్డేట్ ఇచ్చింది. అందరూ అనుకున్నట్టే సలార్ 2 గురించి ఓ అప్డేట్ ఇచ్చింది.

ఆ అప్డేట్ వచ్చిన తర్వాత.. అది అప్డేటేనా అని ఫ్యాన్స్ అనుకున్నారు అది తర్వాత సంగతి. ఇంతకి అంత పెద్ద అప్డేట్ ఏంటంటే… “అతి త్వరలోనే సలార్2” అని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లో అయితే చెప్పారు కానీ, అది సాధ్యమయ్యే పనేనా? నిర్మాతలు హంబోలే ఫిల్మ్స్ వాళ్లు చెబుతుంది నిజమేనా? అసలు అది అయ్యే ఛాన్స్ ఉందా? అనేది ఇప్పుడు చూద్దాం.

స్పిరిట్ బిజీ..

Advertisement

ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. తన ఒక్కడి వల్ల కాకపోవడంతో.. కొన్ని సినిమాలను డూప్‌లు.. మరి కొన్ని సినిమాలు సాధ్యమయ్యే వరకు AIతో చేస్తున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్… స్పిరిట్ షూటింగ్‌లో ఉన్నాడు. ఆ షూటింగ్ పూర్తి అయ్యే వరకు బయటికి పంపించే ఆలోచన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు లేదు. దాదాపు 90 రోజుల ఫిక్సిడ్ కాల్‌షీట్స్.. విత్ కండీషన్స్‌తో తీసుకున్నాడు మరి ఆయన.

తర్వాత ఆప్షన్ కల్కి 2..?

స్పిరిట్‌కు ప్రభాస్ ఇచ్చిన కాల్సీట్స్ ముగిసిన వెంటనే, ప్రభాస్‌ను నాగ్ అశ్వీన్ పట్టుకోబోతున్నట్టు తెలుస్తుంది. కల్కి 2 ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి నాగ్ అశ్వీన్‌తో పాటు నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారంట. కల్కి పార్ట్ 1 మూవీ 2024 జూన్‌లో రిలీజ్ అయింది.

Advertisement

ఇప్పటికే చాలా సార్లు… నిర్మాత అశ్వినీ దత్ కల్కి 2 గురించి అప్డేట్ ఇస్తూ వచ్చారు. అతి త్వరలోనే ఉండబోతుందని అన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా అదే మాట చెబుతూ వచ్చారు. దీని గురించి ప్రభాస్ – నాగ్ అశ్వీన్ మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగాయంట. స్పిరిట్ కంప్లీట్ అయిన వెంటనే.. కల్కి 2 సెట్స్‌లో ప్రభాస్ ఉండటం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

ఇక సలార్ 2 మోక్షం ఎప్పుడంటే..?

నిజానికి కల్కి 2 కంటే.. సలార్ 2 మూవీనే ముందు వచ్చింది. కల్కి ఫస్ట్ పార్ట్ 2024 జూన్ లో రిలీజ్ అయింది. సలార్ ఫస్ట్ పార్ట్ 2023 డిసెంబర్‌లోనే రిలీజ్ అయింది. అలా చూసుకుంటే… కల్కి 2 కంటే సలార్ 2 నే ముందు రావాలి. కానీ, వస్తున్న సమాచారం ప్రకారం… ప్రభాస్ తన కాల్షీట్స్ ముందుగా కల్కి 2 మూవీకే ఇచ్చాడంట. దీంతో కల్కి 2 ముందుగా స్టార్ట్ అవుతుంది.

అదే టైంలో… సలార్ 2 స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండు ప్రాజెక్ట్స్ ఒకేసారి చేయడం కుదరకపోతే మాత్రం.. కల్కి 2 తర్వాతే సలార్ 2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అలా చూసుకుంటే… సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కావాలంటే… 2027 వచ్చే అవకాశం లేకపోలేదు.

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×