E-Paper
Advertisement

Prabhas: సందీప్‌ రెడ్డి వంగా బర్త్‌డే.. ప్రభాస్‌ ఆసక్తికర పోస్ట్‌!

Prabhas: సందీప్‌ రెడ్డి వంగా బర్త్‌డే.. ప్రభాస్‌ ఆసక్తికర పోస్ట్‌!
Advertisement

Prabhas: అర్జున్‌ రెడ్డితో తెలుగు సెన్సేషన్‌ అయ్యాడు సందీప్‌ రెడ్డి వంగా. అదే సినిమాను హిందీలో రీమేక్‌ చేసి బి–టౌన్‌లోనూ సంచలనంగా మారాడు. ఆ తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో యానిమల్‌ తెరకెక్కించి బక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాడు. ఈ మూడు చిత్రాలతో నార్త్‌, సౌత్‌ విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. డైరెక్షన్, మేకింగ్‌లో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్‌ చేసుకున్నారు. ఈయన సినిమాలో హీరోల క్యారెక్టరైజేషన్‌ అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ అన్నట్టుగా ఉంటుంది.

సందీప్ రెడ్డి వంగా బర్త్ డే

Advertisement

మేకింగ్‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టిన వంగా క్రియేటివిటికీ ఇండియన్‌ స్టార్‌ డైరెక్టర్స్‌ సైతం ఫిదా అయ్యారు. కేవలం రెండు సినిమాలతోనే స్టార్‌ దర్శకుల జాబితాలో చేరిన ఈ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ బర్త్‌డే నేడు. ఈ సందర్భందా వంగాకు ఫ్యాన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలాగే సినీ హీరోలు, దర్శకులు, నటీనటులు కూడా ఆయనకు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. ఈ సందర్బంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి వంగాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు.

హ్యాపీ బర్త్ డే బ్రో..

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సందీప్‌ ఫోటో షేర్‌ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే బ్రో.. నీ క్రియేటివిటీని ప్రతి ఒక్కరు చూడటం కోసం వేచి ఉండలేకపోతున్నా” అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్‌ పోస్ట్‌ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాగా.. ఇటీవల ఇది సెట్స్‌పైకి వచ్చింది. కేవలం ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్‌ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్‌ జరుపుకుంటుందా? అని అభిమానులంత ఆసక్తిగా ఎదురు చూశారు. అందరి ఎదురుచూపులకు ఎండ్‌కార్డు వేస్తూ.. గత నెల ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకువచ్చారు.

Advertisement

Also Read: Dhurandhar Movie: సర్‌ప్రైజ్.. ధురంధర్‌ తెలుగు రిలీజ్ డేట్‌ ఫిక్స్‌.. రెండు వారాలకే ఓటీటీకి కూడా!

స్పిరిట్ మూవీతో బిజీ

రీసెంట్‌గా విడుద‌ల చేసిన ‘స్పిరిట్‘ డైలాగ్ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలను. పెంచేసింది. ఈ మూవీ జాతీయ భ‌ద్ర‌తా స‌మ‌స్య చుట్టూ తిగిగే క‌థ‌గా సాగుతుంద‌ని, దేశ భ‌ద్ర‌త‌కు పొంచి ఉన్న భారీ ప్ర‌మాదాన్ని ఎదుర్కొనే నిజాయితీ గ‌ల పోలీస్ అధికారిగా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడ‌ని అర్థమైపోతుంది. యాక్షన్‌ డ్రామా రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్‌ ఇండియా భ‌ద్ర‌తే ధ్యేయంగా ప‌ని చేసే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌పై ప్లాన్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. తొలిసారి ప్రభాస్‌ని ఇలా పోలీస్‌ గెటప్‌లో చూపించి అభిమానులకు ట్రీట్‌ ఫీస్ట్‌ ఇవ్వబోతున్నాడు ఈ వంగా మామ.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×