E-Paper
Advertisement

Dhurandhar Movie: సర్‌ప్రైజ్.. ధురంధర్‌ తెలుగు రిలీజ్ డేట్‌ ఫిక్స్‌.. రెండు వారాలకే ఓటీటీకి కూడా!

Dhurandhar Movie: సర్‌ప్రైజ్.. ధురంధర్‌ తెలుగు రిలీజ్ డేట్‌ ఫిక్స్‌.. రెండు వారాలకే ఓటీటీకి కూడా!
Advertisement

Dhurandhar Telugu Release: బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ధురంధర్‌ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన మూడు వారాల్లోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోతోనే ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కేవలం హిందీ భాషలో విడుదలైన ధురంధర్‌ దక్షిణాదిలోనూ సత్తా చాటుతుంది. డిసెంబ‌ర్ 5న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డ్ కలెక్ష‌న్స్ సాధిస్తూ దూసుకెళుతుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్‌ ఖన్నా ప్రతి కథానాయకుడిగా మెప్పించాడు.

వెయ్యి కోట్ల క్లబ్ లోకి

Advertisement

ఇక సినిమాతోనే ఆయన రీఎంట్రీ ఇవ్వడం విశేషం. సంజయ్‌ దత్‌, మాధవన్‌ వంటి స్టార్స్‌ ఇందులో కీలక పాత్రలు పోషించారు. యూరి డైరెక్టర్‌ అదిత్యథర్‌ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం హిందీ భాషలోనే విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ వస్తుండటంతో ధురంధర్‌ని తెలుగుతో పాటు ఇతర సౌత్‌ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధురంధర్‌ తెలుగు రిలీజ్‌ మరింత ఆసక్తి నెలకొంది. అయితే డిసెంబర్‌ 19న ఈ మూవీ తెలుగు వెర్షన్‌ విడుదల ఉంటుందన్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల మూవీని తెలుగులో రిలీజ్‌ చేయలేకపోయారు. దీంతో ఇక ధురంధర్‌ తెలుగు రిలీజ్ లేదంటూ సోషల్‌ మీడియా తెగ ప్రచారం చేశారు.

డిసెంబర్ 25న తెలుగు రిలీజ్

దీంతో తెలుగు ఆడియన్స్‌ అంత ఈ వార్త విని డిసప్పాయింట్‌ అయ్యారు. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్‌ కోసం మూవీ టీం ఆడియన్స్‌ రిక్వెస్టులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్‌ ఫిక్స్‌ అయ్యారు. క్రిస్మస్‌ కానుకగా మూవీ తెలుగు వెర్షన్‌ రిలీజ్ కి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 25న ధురంధర్‌ తెలుగు వెర్షన్ థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజైన రెండు వారాలకు తెలుగు వెర్షన్‌ ఓటీటీకి వస్తుండటం విశేషం. ధురంధర్‌ మూవీ ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ డిజిటల్‌ సంస్థ అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ సొంతం చేసుకుంది. అన్ని భాషల్లోనూ మేకర్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుందని టాక్‌. కళ్లు చెదిరే డీల్‌తో ధురంధర్‌ రైట్స్‌ని అమెజాన్‌ పొందినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.

రెండు వారాల్లోనే ఓటీటీకి

Advertisement

ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని సంక్రాంతికి సందర్భంగా స్ట్రీమింగ్‌కి ఇవ్వనుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని టాక్‌. తెలుగు థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం రెండు వారాలల్లోనే ధురంధర్‌ ఓటీటీకి రావడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు థియేటట్రికల్‌, ఓటీటీ రిలీజ్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే అప్పుడే ధురందర్‌ పార్ట్‌ 2 రిలీజ్‌ కి అంత సిద్దం చేస్తున్నారు. ధురంధర్‌ 2ని వరల్డ్‌ వైడ్‌గా ఒకేసారి పాన్‌ ఇండియా భాషల్లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌ ఇతర భాషల్లో వచ్చే ఏడాది మార్చి 19న మూవీ రిలీజ్ కానుందని టాక్‌. పార్ట్‌ 2లో ఇమ్రాన్‌ హష్మి విలన్‌ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×