E-Paper
Advertisement

స్పిరిట్ మూవీపై భారీ డిమాండ్.. OTT డీల్ ఇండస్ట్రీ టాక్!

స్పిరిట్ మూవీపై భారీ డిమాండ్.. OTT డీల్ ఇండస్ట్రీ టాక్!
Advertisement

Spirit Movie :OTTల పుణ్యమా అని థియేటర్లు మూసుకునే పరిస్థితి వస్తుంటే మేకర్స్ మాత్రం వందల కోట్లు వెనకేసుకుంటున్న పరిస్థితి. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ఇలాగే సాలిడ్ డీల్ కొట్టేసిందన్న వార్త ఇపుడు మీడియాని షేక్ చేస్తోంది. యస్.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమా కోసం ఏకంగా 250 కోట్ల భారీ రేట్ కోట్ చేసిందట నెట్‌ఫ్లిక్స్. అయితే ఈ డీల్‌పై మేకర్స్ నుండి కానీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుండి కానీ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

ఈ డీల్ గనుక నిజమైతే మాత్రం

Advertisement

ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అంటూ డెలివర్ అవుతున్న తెలుగు సినిమాలకి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ భారీ రేట్ కోట్ చేస్తున్నాయంటే నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాల సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ అవుతున్నాయన్న మాట. ఈ క్రమంలో ఇప్పటికే పుష్ప 2: ది రూల్ డిజిటల్ రైట్స్ 275 కోట్లు, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా డిజిటల్ రైట్స్ 160 కోట్లకి, గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ 150 కోట్లకి పలకగా.. రామ్ చరణ్ ‘పెద్ది’ మరియు యష్ ‘టాక్సిక్’ చిత్రాలు కూడా దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 180 కోట్ల మధ్యలో బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే స్పిరిట్ గనుక 250 కోట్ల భారీ రేట్ కోట్ చేసుకుంటే మాత్రం పుష్ప 2 తర్వాతి ప్లేస్‌లో స్పిరిట్ నిలబడిపోతుంది. ఏమో రిలీజ్ కల్లా ఈ డీల్ పుష్ప 2 ని దాటేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఈ డీల్ గనుక నిజమైతే మాత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అదో రికార్డ్‌గా మిగిలిపోవడం పక్కా.

భారీ బడ్జెట్.. భారీ కాస్టింగ్!

ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే టి-సిరీస్ (T-Series) మరియు భద్రకాళి పిక్చర్స్ కలిసి సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సిన్సియర్ మరియు రఫ్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటిస్తుండగా.. జోడీగా ‘యానిమల్’ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి డిమ్రి నటిస్తుంది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబేరాయ్ ఇందులో ప్రభాస్‌ని డీకొట్టే పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ప్రకాష్ రాజ్ ఉన్నాడా లేదా అన్న వార్తలపై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇస్తే కానీ గాసిప్స్ ఆగేలా లేవు.

Advertisement

2027 మార్చి 5న విడుదల

ఇక సినిమాకి ‘యానిమల్’ సినిమాకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెల్సిందే. జోరుగా సెట్స్ పై పరుగులు పెడుతున్న ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా. అయితే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ వంటి విదేశీ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవబోతుండటం విశేషం. చూడాలి మరి రిలీజ్ కి ముందే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×