నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిరుద్యోగులకు భారీ ఊరటనిస్తూ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 11,127
విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి టెన్త్ క్లాస్‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు అలాగే ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: ఎంపికైన వారికి ప్రారంభ వేతనంగా నెలకు రూ. 19,900 చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక మొత్తం ఐదు దశల్లో సాగుతుంది. తొలుత ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1 ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి సెకండ్ స్టేజ్ సీబీటీ-2 నిర్వహిస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడు పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. అన్ని విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే తుది నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రక్రియ 2026 మే 15 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమర్పించడానికి 2026 జూన్ 14 ఆఖరి తేదీగా నిర్ణయించారు. సికింద్రాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి 21 రైల్వే రీజియన్ల పరిధిలో ఈ నియామకాలు జరుగుతాయి.
రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు పరీక్ష సిలబస్ దరఖాస్తు రుసుము వంటి పూర్తి సమాచారాన్ని రైల్వే బోర్డు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయనుంది. రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbapply.gov.in/
ALSO READ: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 3003 పోస్టులతో ఎస్ఎస్‌సీ నుంచి నోటిఫికేషన్, భారీ వేతనం