E-Paper
Advertisement

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది 

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది 
Advertisement

The Raja Saab: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. చాలా రోజుల తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ రోల్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు. అందుకే ఈ సినిమా మీద చాలామందికి విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ గుర్తింపు సాధించుకున్న విషయం తెలిసిందే. కానీ బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా సీరియస్ మోడ్ లో ఉంటాయి.

చాలామంది అభిమానులు ప్రభాస్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మిస్ అయిపోయారు. దీనిని పసిగట్టి ప్రభాస్ మారుతితో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే మూడు నెలల ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది.

ఫస్ట్ సింగిల్ అప్డేట్ 

Advertisement

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు చాలాసార్లు ప్రకటించారు. నిర్మాత విశ్వప్రసాద్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వస్తుంది అని ముందు చెప్పారు. అప్పుడు ఆ సాంగ్ రిలీజ్ చేయలేదు. నవంబర్ ఐదు న ఈ సాంగ్ విడుదలవుతుంది అని చెప్పారు అప్పుడు కూడా విడుదల కాలేదు.

కొద్దిసేపటి క్రితమే ఈ సాంగ్ కు సంబంధించిన అధికారికి ప్రకటన ఇచ్చారు. ఈ సాంగ్ ఎప్పుడు రాబోతుంది అని రేపు 12 గంటలకి అనౌన్స్ చేస్తారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఎన్నో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అప్డేట్ ఇవ్వడానికి కూడా ఒక అప్డేట్ ఇస్తున్నారు. ఈ అన్ని అప్డేట్లు దాటుకొని సాంగ్ వచ్చేసరికి కనీసం రెండు వారాల పైనే పడుతుంది అనే క్లారిటీ చాలామంది ప్రభాస్ అభిమానులకు వచ్చేసింది. ఏదేమైనా ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. మారుతి ప్రభాస్ ను చాలా అందంగా చూపిస్తున్నాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

భారం అంతా తమన్ పైనే 

పాటలు సూపర్ సక్సెస్ అయిపోయిన తర్వాత టైలర్ సినిమా మీద అంచనాలు మరింత పెంచుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ముందే ట్రైలర్ విడుదల అయిపోయింది. కాబట్టి అంచనాలన్నీ కూడా ఇప్పుడు పాటలు మీదే ఉన్నాయి. రోజుల్లో పాటలు హిట్ అయితేనే థియేటర్స్ కు ఆడియన్స్ రావడానికి ఆసక్తి చెబుతారు.

ఈ సినిమాకి తమన్ ఎటువంటి మ్యూజిక్ అందించాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలకు పూర్తిస్థాయిలో తమన్ సంగీతం చేయలేదు. మరి ఇప్పుడు తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి.

Also Read: Andhra King Taluka: నాపైన ఆ అభిమాని పుస్తకం రాశాడు, పదేళ్లు నాతో మాట్లాడలేదు

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×