Harbhajan Singh: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ( Harbhajan Singh) వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ క్రికెటర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి వివాదానికి తెర లేపాడు. దీంతో హర్భజన్ సింగ్ దేశద్రోహి అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మధ్య మొన్న ఎండాకాలం యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగితే షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు టీమిండియా ప్లేయర్లు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament) నుంచి ఇప్పటి వరకు అదే తంతు కొనసాగుతోంది. కానీ టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం ఈ రూల్ బ్రేక్ చేసి, పాకిస్తాన్ వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వివాదానికి తెర లేపాడు.
అబుదాబి టీ10 లీగ్ 2025 టోర్నమెంట్ ( Abu Dhabi T10 League 2025) ఇటీవల ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్పిన్ స్టాలియన్స్ జట్టు తరఫున హార్భజన్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా తాజాగా ఆస్పిన్ స్టాలియన్స్ vs నార్తర్న్ వారియర్స్ మధ్య మూడవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆస్పిన్ స్టాలియన్స్ పైన నార్తర్న్ వారియర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ విజయం అనంతరం హర్భజన్ సింగ్ చేసిన పని వివాదంగా మారింది. మ్యాచ్ పూర్తికాగానే పాకిస్తాన్ బౌలర్ షానవాజ్ దహానీకు ( Shahnawaz Dahani) హర్భజన్ సింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో హర్భజన్ సింగ్ దేశద్రోహి అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి వాళ్లకు తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు. గతంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడ బోనంటూ WCL టోర్నమెంట్ నుంచి హర్భజన్ సింగ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అలాంటి హర్భజన్ సింగ్, పాకిస్తాన్ బౌలర్ షానవాజ్ దహానీ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం… దుమారం రేపుతోంది.
పాకిస్తాన్ బౌలర్ షానవాజ్ దహానీకు ( Shahnawaz Dahani) షేక్ హ్యాండ్ ఇవ్వడంపై హర్భజన్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. అతడు గ్రౌండ్ స్టాఫ్ అనుకున్నానని, వాడు పాకిస్తాన్ ప్లేయర్ అన్న విషయం తనకు తెలియదన్నారు. అందుకే హడావిడిలో పడి, షేక్ హ్యాండ్ (No Shake Hand) ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు.
Harbhajan singh on media vs Harbhajan singh on ground….. pic.twitter.com/ss5HvDnuJe
— Inzimam (@I_Engr56) November 20, 2025
Harbhajan Singh explained why he shake hands with Dahani 🗣️😂 pic.twitter.com/hvUvhgszim
— Lokesh Saini (@LokeshVirat18K) November 20, 2025