The Raja Saab Trailer: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) త్వరలోనే మారుతి దర్శకత్వంలో నటించిన ది రాజా సాబ్(The Raja saab) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ ఒక ట్రైలర్ విడుదల చేశారు అలాగే రెండు పాటలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇలా వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమా పట్ల చిత్ర బృందం మంచి అంచనాలనే పెంచేశారు. తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం మరొక ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 3:12 నిమిషాల నిడివితో విడుదల చేసిన ఈ ట్రైలర్ లో భయానకరమైన సంఘటనలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో అద్భుతంగా కట్ చేశారు. ఈ ట్రైలర్ సినిమా పట్ల మరింత అంచనాలను పెంచేసింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్, నటి జరీనా మధ్య మంచి ఎమోషనల్ సన్నివేశాలు కొనసాగుతున్నాయని స్పష్టమవుతుంది. ప్రభాస్ ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన విధంగానే ఈ సినిమా నానమ్మ మనవడి కథ అని ఈ ట్రైలర్ ద్వారా తెలిసిపోతుంది. మొత్తానికి ఈ సినిమా ద్వారా ప్రభాస్ లో మరో యాంగిల్ చూడబోతున్నామని కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అకట్టుకుంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించి సందడి చేశారు.
ది రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో సప్తగిరి, ప్రభాస్ శీను వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించబోతుందని, దాదాపు 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రభాస్ కు తాతయ్య పాత్రలో కనిపించబోతున్నారు.
ఇలా ఈ సినిమాని ఎంతో విభిన్నంగా పాన్ ఇండియా స్థాయిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సంక్రాంతి బరిలో ప్రభాస్ సినిమాతో పాటు చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు సినిమాలతో పాటు పరాశక్తి, జననాయగన్ వంటి సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read; Jagapathi Babu: పెద్ది సినిమాలో మరో స్టార్.. అప్పల సూరిగా జగ్గు భాయ్