E-Paper
Advertisement

The RajaSaab Collections: అత్యంత దారుణంగా రాజా సాబ్ డే 1 కలెక్షన్స్… ఈ 5 కారణాల వల్లే!

The RajaSaab Collections: అత్యంత దారుణంగా రాజా సాబ్ డే 1 కలెక్షన్స్… ఈ 5 కారణాల వల్లే!
Advertisement

The RajaSaab Collections: ఒకవైపు నిర్మాతగా.. మరొకవైపు దర్శకుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మారుతి (Maruthi) .. తాజాగా ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడిగా తన టాలెంట్ కు పదును పెట్టిన ఈయన.. ఏకంగా ప్రభాస్ తో సినిమా చేస్తున్నారని చెప్పినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలా ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుడి నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ఏకంగా 8 మంది హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే భారీ స్థాయిలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే కొన్ని ఏరియాలలో నెగిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ది రాజాసాబ్ డే 1 ఎక్స్‌పెక్టెడ్ కలెక్షన్స్..

సినీ విశ్లేషకులు నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి 25 నుండి 30 కోట్లు మొదటి రోజు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షోలు మొదలవుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రీమియర్ షోలు పడ్డాయి. నైజాం ఏరియాలో ప్రీమియర్స్ పడకపోవడం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. పైగా దీనివల్ల మూవీ ఓపెనింగ్స్ పై భారీగా ప్రభావం పడింది. మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అన్ని ఏరియాలలో నిన్న రాత్రి 9 గంటలకే ప్రీమియర్స్ మొదలయ్యాయి. పైగా ఆయా ఏరియాలలో చాలావరకు సినిమాకు నెగిటివ్ టాక్ లభించింది. కొన్ని ఏరియాలలో మిక్స్డ్ టాక్ వస్తోంది. అలా సినిమా ఫలితం ముందే తెలుసుకున్న ఆడియన్స్ థియేటర్ కి రావడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ కారణాలే సినిమాకు ఓపెనింగ్స్ చాలా తక్కువ వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపోతే ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు సుమారుగా 100 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ ఇలాంటి కారణాలవల్ల 30 కోట్ల వరకే వచ్చినట్టు తెలుస్తోంది.

కలెక్షన్స్ తగ్గడానికి ప్రధానంగా వినిపిస్తున్న 5 కారణాలు..

Advertisement

1) నైజాం ఏరియాలో ప్రీమియర్స్ పడకపోవడంతో సినిమా కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. దీనివల్ల ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం పడింది.

2) ఏపీలో దాదాపు అన్ని ఏరియాల్లో రాత్రి 9 గంటలకే ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. నెగిటివ్ టాక్ బయటకు రావడంతోనే సినిమా చూడడానికి ఆడియన్స్ థియేటర్ కి రావడం లేదు.

Advertisement

3). క్లైమాక్స్ లో పార్ట్ 2 అని చెప్పి ఫస్ట్ లుక్ ట్రైలర్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలను సినిమాలో చూపించకపోవడంతో అటు అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పార్ట్ 2 అనే కాన్సెప్టే లేకపోతే.. అన్నీ ఈ సినిమాలోనే కవర్ అయ్యేవి. అప్పుడు ఫాన్స్ కొంతవరకైనా కూల్ అయ్యే వాళ్లేమో.

4).ఇక ఈ చిత్రానికి అతిపెద్ద మైనస్ రన్ టైం.. 3 గంటల 10 నిమిషాలు. అంత ఓపికతో థియేటర్ లో ఎవరూ కూర్చోలేకపోయారు .

5) సాంగ్స్.. సినిమాకు అస్సలు సంబంధం లేకుండా ఉన్నాయి. అసలేం సాంగ్స్ పెట్టకుండా ఫుల్ లెన్త్ కామెడీ, హర్రర్ తీసుకుంటే బాగుండు అని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే 100 కోట్లు మొదటి రోజు రాబట్టాల్సిన ఈ సినిమా 30 కోట్లు కూడా రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తోంది.

ALSO READ:Pawan Kalyan: నేను నెం 1 కాదు… టాలీవుడ్‌లో తన స్థానంపై పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×