బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యకాలంలో చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికారం పోయిందన్న నిరాశలో అలా మాట్లాడుతున్నారా? లేక కేసులు వెంటాడుతున్నాయన్న భయంతో అలా మాట్లాడుతున్నారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది. అధికార పార్టీపై ఇటీవల ఆయన చేస్తున్నవ్యాఖ్యలు ఇటీవలి కాలంలో శృతి మించుతున్నాయని సైతం ఆరోపణలున్నాయి. ఇటీవల ఆయన ఖమ్మం సభలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై పరుష పదజాలంతో విమర్శలు చేశారు. దీనికి తోడు తాజాగా కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
కేటీఆర్ మాట్లాడిన ప్రతిసారీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరినీ కలిపి విమర్శలు చేస్తుండటం చూసే ఉంటాం. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి నెలనెలా ఢిల్లీకి మూటలు మోస్తున్నారని అంటుంటారు. అందుకే పాలనను గాదికొదిలేసిన సీఎం.. హస్తినకు మూటలు పంపే బిజీలో ఉన్నారని విమర్శిస్తుంటారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి ప్రత్యేక వేదిక అవసరం లేదు.దాన్ని సున్నింతంగా కూడా చూపించవచ్చు. దానికి పోయి ఆవేశం ఎందుకు అని పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకుని అసభ్యంగా, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. కేటీఆర్ నాయకత్వ వైఫల్యం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నదని, ముందుగా కవిత ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.
హిల్ట్ పాలసీతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగుపై కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీద అదే పనిగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో చర్చకు ముందుకు రాని బీఆర్ఎస్ నేతలు.. నదీ జలాలపై చర్చ చేయకుండానే సెషన్స్ బాయ్‌కాట్ చేశారు. కానీ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా విమర్శించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడానికి అసెంబ్లీలో అంతమంచి అవకాశాన్ని బీఆర్ఎస్ మిస్ చేసుకుందని సీనియర్ పొలిటిషన్లు విమర్శిస్తున్నారు. బయట మాట్లాడేదేదో సభలో మాట్లాడితే బాగుంటుంది కదా? అని ఎత్తిచూపుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన కరువైంది.
Navadeep: డ్రగ్స్ కేసు నుంచి నటుడు నవదీప్‌కు రిలీఫ్.. కోర్టు ఏం అన్నదంటే?
హిల్ట్ పాలసీతో రాష్ట్రంలో రూ.10వేల కోట్ల భూ కుంభకోణానికి రేవంత్ సర్కార్ తెరలేపిందని ఆరోపిస్తున్న కేటీఆర్.. రాహుల్ గాంధీ దీనిమీద స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగులతో ముచ్చటించిన రాహుల్ గాంధీ.. ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ కోసం విద్యార్థులు రోడ్లమీదకు వస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.రాహుల్, రేవంత్ రెడ్డికి హైదరాబాద్ రియల్ దందాపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలపై, వారిచ్చిన ఆరు గ్యారెంటీలపై లేదని విమర్శలు చేస్తున్నారు. బడే బాయ్, చోటే బాయ్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా రాహుల్ గాంధీకి లేదని.. ఆయన పప్పు కాదని ముద్దపప్పు అని.. సోనియా గాంధీ ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న బలిదేవత అని..ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఈ వ్యాఖ్యలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పార్టీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సమయంలో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మీ తండ్రి కేసీఆర్ అంగీకరించి మాట మార్చిన విషయం నిజం కదా? అని మంత్రులు సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ గాంధీ మీద విమర్శలు చేసే స్టేచర్ కేటీఆర్ కు లేదని మండిపడుతున్నారు.