E-Paper
Advertisement

Prabhas: డైరెక్టర్ గా మారుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్, ఏకంగా ప్రభాస్ హీరోగా

Prabhas: డైరెక్టర్ గా మారుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్, ఏకంగా ప్రభాస్ హీరోగా
Advertisement

Prabhas: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్స్ లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఒకరు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్ గా పరిచయం అయ్యారు. ఛత్రపతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభాస్ కి విపరీతమైన స్టార్డం తీసుకొచ్చిన సినిమా ఛత్రపతి. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కు విపరీతమైన పేరును తీసుకొచ్చిన సినిమా ట్రిపుల్ ఆర్. ఆస్కార్ రేంజ్ కి వెళ్ళిన నాటు నాటు పాటను కొరియోగ్రఫీ చేసింది ప్రేమ రక్షిత్ మాస్టర్. గత కొంతకాలంగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డైరెక్షన్ చేస్తారు అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆ వార్తలు ఇప్పుడు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి.

ఏకంగా ప్రభాస్ హీరోగా 

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఒక సీనియర్ ప్రొడ్యూసర్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

మరోవైపు ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ ఒకవేళ ఫ్రేమ్ రక్షిత్ కు డేట్స్ ఇచ్చిన కూడా ఆ సినిమా పూర్తయి రిలీజ్ అయ్యే సరికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మరోసారి బయటకు తీస్తున్నాడు మారుతి.

వాళ్ళలా సక్సెస్ అవుతారు? 

Advertisement

ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది కొరియోగ్రాఫర్ దర్శకులుగా మారారు. అందులో రాఘవ లారెన్స్, ప్రభుదేవా వంటి వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. ప్రభుదేవా తీసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత పౌర్ణమి కూడా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది.

రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాను తీసిన స్టైల్, మాస్, డాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. వీళ్లు కూడా మొదటి కొరియోగ్రాఫర్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లే. ఇక ప్రేమ్ రక్షిత్ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Also Read: Rajamouli : సుమ లీక్ చేసిన వీడియోలు ఇది గమనించారా? రాజమౌళి మామూలోడు కాదు

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×