E-Paper
Advertisement

Sushma Bhupathi: ఇంట్లో బియ్యం లేని పరిస్థితి, ఎవరు పట్టించుకోలేదు

Sushma Bhupathi: ఇంట్లో బియ్యం లేని పరిస్థితి, ఎవరు పట్టించుకోలేదు
Advertisement

Sushma Bhupathi: ఒకప్పుడు మంచిగా పేరు సంపాదించాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఆఫీసులకు వెళ్లి సినిమా ఆడిషన్స్ ఇచ్చి తర్వాత సినిమాల్లో సెలెక్ట్ అయిన తరువాత వాళ్ళ ప్రతిభతో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజుల్లో సినిమా అవకాశాలు కాకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా చాలామంది పాపులర్ అవుతున్నారు.

అలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్ళ దగ్గరికి చాలా మంది తెలుగు సినిమా ప్రముఖులు వచ్చి వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఎక్కువగా ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు.

Advertisement

ఆ ప్రమోషన్స్ కి కొంత డబ్బులు కూడా చిత్ర యూనిట్ ఇస్తుంది. అలా ఇంస్టాగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు సుష్మ భూపతి. ఈమె డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆమె పాపులర్ అవ్వడానికంటే ముందు తన పరిస్థితి ఎలా ఉండేదో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

ఇంట్లో బియ్యం కూడా లేవు

నేను ఫేమస్ అవ్వకముందు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. నిజాయితీగా చెప్తున్నాను దాచి పెట్టడానికి ఏమీ లేదు. నాకు పాప పుట్టినంత వరకు నేను వర్క్ చేసేదాన్ని, ఆయన వర్క్ చేసేవాళ్లు. పాప పుట్టిన తర్వాత నేను టీచింగ్ మానేశాను. మా భర్త తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వలన, ఫైనాన్స్ లుగా చాలా లాస్ అయిపోయాం.

Advertisement

మొత్తం రోడ్డు మీదకు వచ్చేసాము. అంటే మా దగ్గర ఇంట్లో తినడానికి బియ్యం కూడా లేవు. నాకు చాలా పెద్ద బలగం ఉంది, మా ఆయనకు కూడా పెద్ద బలగం ఉంది. రెండు సంవత్సరాలు నేను ఆర్థిక పరిస్థితులతో శతమతమయ్యాను. కానీ ఎవరు తొంగి చూడలేదు.

చిరిగిన షర్టుతో బాబు స్కూలుకు

మా బాబు చిరిగిపోయిన షర్టుతో స్కూలుకు వెళ్ళాడు. అది నేను నా జీవితంలో ఇంకా మర్చిపోలేను. నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరూ రాలేదు. పక్కింటి వాళ్ల దగ్గర రేషన్ బియ్యం అడుక్కుని మా ఇంట్లో పిల్లలకు పెట్టాం. మా హస్బెండ్ అప్పుడు జాబ్ కూడా చేస్తూ ఉండేవాడు. కానీ కార్డ్స్ ఆటో డెబిట్ వలన శాలరీ పడగానే కట్ అయిపోయేది.

రెంటు, రేషన్ కంపల్సరీ కాబట్టి చాలా ఇబ్బంది పడటం. మా ఆయన ఉన్నఫలంగా బరువు తగ్గిపోయాడు. కానీ ఎవ్వరూ కూడా మమ్మల్ని ఆ టైంలో చూడలేదు. కానీ instagram లో ఫేమస్ అయిన తర్వాత బాగా చేస్తున్నారు ఇలానే చెయ్ అని అనడం మొదలుపెట్టారు. మా పక్కింటి వాళ్లు చాలా హెల్ప్ ఫుల్ వాళ్లు మాకు బాగా సహాయపడ్డారు అని సుష్మా భూపతి తన ఎదుర్కొన్న కష్టాలను చెప్పింది.

Also Read: Dhee Abhi Master: మా అమ్మ చనిపోయింది, చాలా బాధపడుతున్న టైంలో పోకిరి లెవెల్ ట్విస్ట్

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×