E-Paper
Advertisement

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!

హంస లాంటి సోయగాలతో మైమరపిస్తున్న నిధి అగర్వాల్!
Advertisement

Nidhhi Agerwal:2018లో వచ్చిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిధి అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. మళ్లీ 2019లో మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈమెకు ఊహించని విజయం లభించింది.

 Nidhhi Agerwal latest lehenga Photo Gallery
Nidhhi Agerwal latest Photo Gallery ..see pics (image credit: Instagram)

ఇక తర్వాత హీరో అనే సినిమాలో చేసిన ఈమె మళ్లీ రెండేళ్లు తెలుగు ఇండస్ట్రీకి దూరమై.. 2025లో హరిహర వీరమల్లు పార్ట్ వన్ సినిమాలో పంచమి పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. నిధి అగర్వాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

 Nidhhi Agerwal latest lehenga Photo Gallery
Nidhhi Agerwal latest Photo Gallery ..see pics (image credit: Instagram)
Advertisement

ది రాజా సాబ్ సినిమా తర్వాత మళ్లీ మరో హారర్ థ్రిల్లర్ మూవీలో ఈమె నటిస్తోంది. నిఖిల్ కార్తీక్ దర్శకత్వంలో జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఒక కొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడి కానున్నాయి.ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది నిధి అగర్వాల్.

 Nidhhi Agerwal latest lehenga Photo Gallery
Nidhhi Agerwal latest Photo Gallery ..see pics (image credit: Instagram)

అందులో భాగంగానే తాజాగా మరో లేటెస్ట్ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ మేరకు తాజాగా.. హైదరాబాద్ కి చెందిన సుప్రసిద్ధ భారతీయ ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్ వరుణ్ చక్కిలం డిజైన్ చేసిన ఐవరీ లెహంగాలో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. నిధి అగర్వాల్ ధరించిన ఈ లెహంగా టాప్ టు బాటమ్ అతి క్లిష్టమైన ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేశారు. పూసల అలంకరణతో దీనిని డిజైన్ చేశారు. ఇక బాటమ్ కి అక్కడక్కడ పూల తీగల లాంటి ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేయగా .. స్కాలప్డ్ బార్డర్ తో స్కర్ట్ ను మరింత అందంగా డిజైన్ చేశారు. ఇక దీనికి సరిపోయే ఆర్గాంజ దుపట్టాను మ్యాచ్ చేశారు.

 Nidhhi Agerwal latest lehenga Photo Gallery
Nidhhi Agerwal latest Photo Gallery ..see pics (image credit: Instagram)
Advertisement

మధ్యలో ఆకర్షణీయమైన పచ్చరత్నం చుట్టూ ప్రీమియం అన్ కట్ డైమండ్స్ తో డిజైన్ చేసిన చౌకర్ నెక్లెస్ ను ధరించింది. ఈ ఐవరీ రంగు దుస్తులకు ఆపోజిట్ గా ఆకుపచ్చ రంగు అలంకరణతో కూడిన చెవి డ్రాప్ లు ఈమె లుక్కును మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. అలాగే వజ్రాలు పొదిగిన కాక్ టెయిల్ ఉంగరాలతో తను లుక్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. మొత్తానికైతే హంసలా ఆకర్షిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

ఒకే సినిమాలో 12 పాత్రలు.. కమల్ హాసన్‌ను మించిపోయిన ప్రియాంక చోప్రా!

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

Big Stories

Advertisement
×