E-Paper
Advertisement

Prakash Raj on Betting Apps: తప్పు చేశాను… తెలియక చేసినా.. తప్పు తప్పే

Prakash Raj on Betting Apps: తప్పు చేశాను… తెలియక చేసినా.. తప్పు తప్పే
Advertisement

Prakash Raj on Betting Apps : సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదించారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా యువత బెట్టింగ్ యాప్ (Betting App)కారణంగా ఇబ్బందులు పడటమే కాకుండా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఈ తరుణంలోనే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు ఉక్కు పాదం మోపుతూ వీటిని నియంత్రించే చర్యలు చేపడుతున్నారు.

సీఐడీ ముందుకు ప్రకాష్ రాజ్..

ఈ క్రమంలోనే పలువురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు రుజువు కావడంతో వారిపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇదివరకు ఈడీ విచారణ చేపట్టగా ఇప్పుడు సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇదివరకే విజయ్ దేవరకొండ సిరి హనుమంత వంటి వారు ఈ విచారణలో పాల్గొన్నారు. ఇక నేడు సిఐడి అధికారుల ముందుకు నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు ఈయనని విచారించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి కీలక విషయాలను తెలియచేశారు.

గేమింగ్ యాప్ అనుకొని ప్రమోషన్..

Advertisement

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. నోటీసులు ఇచ్చిన విధంగానే తాను సిఐడి విచారణకు హాజరయ్యారని తెలిపారు. గతంలో తాను బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించానని తెలిపారు. అయితే తాను 2016 వ సంవత్సరంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశానని 2017 లోనే ఆ బెట్టింగ్ యాప్ ను పూర్తిగా నిషేధించారని వెల్లడించారు. ఈ విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించినట్లు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అయితే తాను 2016వ సంవత్సరంలో గేమింగ్ యాప్ అనుకొని ప్రమోట్ చేశానని.. అది బెట్టింగ్ యాప్ అనుకొని కంటిన్యూ చేయలేదని వివరణ ఇచ్చారు.

ప్రాణాలు కోల్పోవడం బాధాకరం..

Advertisement

ఈ బెట్టింగ్ యాప్ మినహా తాను ఇతర బెట్టింగ్ యాప్స్ ఎక్కడ ప్రమోట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్స్ వాడొద్దు ముఖ్యంగా యువత బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లొద్దని తెలిసి చేసినా.. తెలియక చేసిన, తప్పు తప్పేనని తెలిపారు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి మోసపోవద్దని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని తెలిపారు. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలామంది ప్రాణాలను కోల్పోవడం నిజంగా బాధాకరం అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇకపై తాను ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ లేదా గేమింగ్ యాప్స్ వంటి వాటిని ప్రమోట్ చేయనని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Also Read: Actress Kajol: పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలి.. కాజోల్ షాకింగ్ స్టేట్మెంట్

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×