E-Paper
Advertisement

Actress Kajol: పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలి.. కాజోల్ షాకింగ్ స్టేట్మెంట్

Actress Kajol: పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలి.. కాజోల్ షాకింగ్ స్టేట్మెంట్
Advertisement

Actress Kajol: ఇటీవల కాలంలో ఎంతోమంది పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే తమ బంధానికి స్వస్తి పలుకుతున్న సంగతి తెలిసిందే. ఇలా విడాకులు తీసుకుని విడిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సంస్కృతి సినిమా ఇండస్ట్రీలో మరి కాస్త ఎక్కువగా ఉందని చెప్పాలి. కొన్ని సంవత్సరాలు తరబడి ప్రేమలో ఉన్న జంట పెళ్లిళ్లు చేసుకొని రెండు లేదా మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన కొన్ని జంటలు తిరిగి కొత్త ప్రయాణం మొదలు పెట్టగా మరి కొంతమంది అదే బాధలో ఉండిపోయారు.

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ అవసరం..

ఇలా ఇండస్ట్రీలో విడాకుల(Divorce) పరంపర ఎక్కువగా ఉన్న సమయంలో బాలీవుడ్ నటి కాజోల్ (Kajol)పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కాజోల్, ట్వింకిల్ కన్నా (Twinkle Khanna)వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న “టూ మచ్ కాజోల్ విత్ ట్వింకిల్” (Two Much With Kajol and Twinkle)అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి నటుడు విక్కీ కౌశల్, కృతి సనన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్వింకిల్ కన్నా విక్కీ కౌశల్ కృతి సనన్ ను ప్రశ్నిస్తూ పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ  డేట్, రెన్యువల్ ఆప్షన్ అవసరమా? అనే ప్రశ్న ఎదురవడంతో టింకిల్ కన్నా అవసరం లేదు అంటూ రెడ్ జోన్ లో ఉండగా కాజల్ మాత్రం గ్రీన్ జోన్ లో ఉంటూ పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ అలాగే రెన్యువల్ ఆప్షన్ ఉండాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విడాకుల తర్వాత బాధ ఉండదు..

Advertisement

ఈ విషయంపై కాజోల్, ట్వింకిల్ కన్నా మధ్య కొంత వాదన కూడా జరిగింది. అయితే ఈ విషయంపై కాజోల్ మాట్లాడుతూ.. మనం పెళ్లి చేసుకునే సమయంలో సరైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నామా లేదా అనేది తెలియదు కనుక పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ అలాగే రెన్యువల్ ఆప్షన్ ఉండాలి అప్పుడే విడాకుల తర్వాత కూడా ఎవరు ఎక్కువగా బాధపడరు అంటూ ఈమె తన వాదనను వినిపించారు. ఇలా పెళ్లి గురించి కాజోల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విడాకుల సంఖ్య పెరుగుతుందా?

Advertisement

ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ కాజోల్ చెప్పింది కూడా నిజమే కదా అంటూ కామెంట్లు చేయగా… మరికొందరు ఈమె వ్యాఖ్యలను పూర్తిగా వ్యతిరేకిస్తూ.. ఇలాంటి అవకాశం కూడా ఉంటే అప్పుడు విడాకులు తీసుకునే వారి సంఖ్య మరింత పెరుగుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లి విషయంలో కాజోల్ చేసిన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక కాజోల్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండటమే కాకుండా పలు కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read: Allu Sneha Reddy: జాక్ పాట్ కొట్టా.. బన్నీతో ప్రేమపై స్నేహ రెడ్డి కామెంట్

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×