E-Paper
Advertisement

వైయస్ జగన్ ‘మావిగన్’ ..సినిమా టైటిల్ రిజిస్టర్ చేసుకున్న నిర్మాత?

వైయస్ జగన్ ‘మావిగన్’ ..సినిమా టైటిల్ రిజిస్టర్ చేసుకున్న నిర్మాత?
Advertisement

Mavigun: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా “మావిగన్” (Mavigun) అనే పేరు మారుమోగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravathi)ని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే .అయితే అమరావతికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్(Y.A.Jagan) వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమరావతి విషయంలో వైయస్ జగన్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి కాకుండా మచిలీపట్నం, వైజాగ్, గుంటూరు ఈ మూడు ప్రాంతాలు కలిసేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. అలాగే ఈ మూడు ప్రాంతాలను కలిపి రాజధానిగా ప్రకటిస్తే రాజధాని పేరు “మావిగన్” అని పెట్టాలని ఆయన సూచించారు.

మావిగన్ పేరుతో టైటిల్ రిజిస్టర్..

మచిలీపట్నంలో నుంచి MA, వైజాగ్ నుంచి VI, గుంటూరు నుంచి GUN అని పదాలను తీసుకుంటూ ఈ పేరును నిర్ణయించినట్లు జగన్ స్పష్టంగా తెలిశారు. అయితే ఈ పేరు నచ్చకపోతే ఈ మూడు ప్రాంతాలను రాజధానిగా ప్రకటిస్తూ ఇక్కడ కూడా అమరావతి అనే పేరు పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే జగన్ ఈ పేరు చెప్పడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవ్వడమే కాకుండా జగన్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ టాలీవుడ్ నిర్మాత ఏకంగా ఫిలిం ఛాంబర్ లో “మావిగన్” అని పేరుతో టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నట్టు తెలుస్తుంది.

సోషల్ మీడియా ట్రెండింగ్ లో మావిగన్..

Advertisement

ఇలా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న ఈ పేరుతో నిర్మాత టైటిల్ రిజిస్టర్ చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ టైటిల్ తో సదరు నిర్మాత ఎలాంటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇలా ఎంతో మది నిర్మాతలు ఏదైనా ఒక పదం నచ్చితే వెంటనే టైటిల్స్ రిజిస్టర్ చేసుకోవడం ఆనవాయితీగానే వస్తుంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ “సీజ్ ద షిప్” అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ “సీజ్ ద షిప్”..

Advertisement

ఇలా పవన్ కళ్యాణ్ “సీజ్ ద షిప్” అంటూ కామెంట్లు చేయడంతో ఈ పేరును ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ పేరుపై ఎలాంటి సినిమాలు కూడా ప్రకటించలేదు. భవిష్యత్తులో ఏవైనా ఈ టైటిల్ తో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయేమో ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం వైయస్ జగన్ మావిగన్ పేరు కూడా బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే అసలు రాజధానికి ఈ పేరు పెట్టడం ఏంటి అంటూ కొంతమంది విమర్శించగా, మరికొందరు మాత్రం ఇది మామిడి తెగులు పేరు అంటూ ఈ పేరుపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జగన్ చాలా స్పష్టంగా మీకు నచ్చిన పేరును పెట్టుకొని ఈ మూడు ప్రాంతాలను కలిపి రాజధానిగా ప్రకటించాలి అంటూ చెప్పినప్పటికీ తనపై విమర్శలు రావటం గమనార్హం.

Also Read: తమిళనాడు ఎన్నికల వేళ… హాట్ టాపిక్ గా మారిన త్రిష ఆస్తుల విలువ!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×