E-Paper
Advertisement

Prakash Raj: మొరిగే వాళ్లను మొరగనివ్వండి.. అనసూయకు మద్దతుగా ప్రకాష్ రాజ్!

Prakash Raj: మొరిగే వాళ్లను మొరగనివ్వండి.. అనసూయకు మద్దతుగా ప్రకాష్ రాజ్!
Advertisement

Prakash Raj: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల వస్త్రధారణ విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్లు సినిమాలకు అనుగుణంగా దుస్తులు ధరించడం సర్వసాధారణం అయితే బయటకు వచ్చినప్పుడైనా సరైన దుస్తులు ధరించాలని చాలామంది ఇదివరకు ఎన్నో సందర్భాలలో తెలియచేశారు. ఈ క్రమంలోనే నటుడు శివాజీ(Sivaji) సైతం దండోరా సినిమా(Dandora Movie) ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా ఇండస్ట్రీలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మిడిమిడి జ్ఞానం..

శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పు పడుతూ అనసూయ(Anasuya) నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్తలలో నిలుస్తున్నారు. ఇక ఈ వివాదంలో కొంతమంది సెలబ్రిటీలు అనసూయకు మద్దతుగా నిలబడగా మరికొందరు శివాజీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)సైతం అనసూయకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. “మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే సంస్కారులను అలాగే మొరగనివ్వండి.. మీ పోరాటం ఆపొద్దు మేమంతా మీ వెనకే ఉన్నాం” అంటూ ఈయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ అనసూయకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు.

మీరు వాడిన భాష ఏంటీ?

Advertisement

ఇలా సోషల్ మీడియా వేదికగా స్పందించడమే కాకుండా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మరోసారి ఇదే అంశం గురించి మాట్లాడుతూ… శివాజీకి పలు ప్రశ్నలు వేశారు. ఆడవాళ్ళ విషయంలో శివాజీ మాట్లాడింది ముమ్మాటికి తప్పని తెలిపారు. మహిళల పట్ల మీరు వాడే ఆ భాష ఏంటి? ఆడవాళ్ళ గురించి ఏమనుకున్నారు మీ ఆలోచన ధోరణిలో కచ్చితంగా మార్పు రావాలి. మీకు ఏ విషయంలోనైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి అంటూ ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా శివాజీ వ్యాఖ్యలను పూర్తిగా తప్పు పడుతూ అనసూయకు మద్దతుగా నిలిచారు.

Advertisement

ఇక అనసూయ శివాజీని ప్రశ్నించడంతో ఆమెపై ఎంతోమంది విమర్శలు చేశారు కానీ తనకు చాలామంది మద్దతు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సినీ హీరోయిన్లు పలువురు స్టార్ హీరోలు సైతం అనసూయకు మద్దతుగా నిలబడ్డారు ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు సైతం ఈ అంశంపై మాట్లాడుతూ శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. నాగబాబుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా నాగబాబు అనసూయకు మద్దతు తెలియజేస్తూ ఒక వీడియోని వదలడంతో అనసూయ ఆ వీడియో పై స్పందిస్తూ మీరు ఎప్పుడు మాకు అండగా ఉంటారు బాబు గారు అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం హీరోయిన్ల వస్త్రధారణ విషయంలో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Also Read: Pushpa 2 Stampede Case :పుష్ప2 తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్.. అల్లు అర్జున్‌పై ఛార్జిషీట్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×