Dragon Movie: ప్రశాంత్ నీల్…లెక్కలేసినట్టుగా, అంటు కట్టినట్టుగా, తీస్తే ఇలాగే తీయాల్రా అన్నట్టుగా పక్కా మీటర్ లో సినిమాలని తీసే కమర్షియల్ డైరెక్టర్. అలాంటి నీల్ ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ హిట్‌ల తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ తో సినిమా చేస్తున్నాడు అనగానే మురిసిపోయింది టాలీవుడ్.ఇక మా వాడి ఖాతాలో మరో వెయ్యి కోట్లు పక్కా అంటూ కాలర్ ఎగరేశారు తారక్ ఫ్యాన్స్.ఈ అంచనాలే ఇప్పుడు సినిమాకు నెగెటివ్ కాబోతున్నాయా అంటే ఇన్ సైడ్ వినిపిస్తున్న టాక్స్ బట్టి అవుననే ఆన్సర్ వినిపిస్తుంది.
స్క్రిప్ట్ లోపమా? అందుకే దేవ కట్టా అవసరమయ్యారా?
లేటెస్ట్ గా ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్‌లోకి సీరియస్ డైరెక్టర్ దేవ కట్టా ఎంట్రీ ఇస్తున్నాడట.ప్రస్థానం, రిపబ్లిక్,మయసభ వంటి కల్ట్ సినిమా,సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమాకి ఒక వెర్షన్ డైలాగులు రాయబోతున్నాడని సమాచారం.అయితే కట్టా ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడం బాగానే ఉంది కాని ఇక్కడే అసలు డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.
ప్రశాంత్ నీల్ లాంటి భారీ యాక్షన్ డైరెక్టర్ ఉండగా, దేవ కట్టా ఎందుకు? నీల్ కేవలం ఎలివేషన్లకే పరిమితమై, ఎమోషన్ పండించలేక దేవ కట్టా సహాయం కోరుతున్నారా?అన్న గుసగుసలు నెట్టింట్లో వినిపిస్తున్నాయ్.తనదైన యాక్షన్ సినిమాలో ఉన్నా కథలో దమ్ము లేకపోతె సినిమా తేలిపోవడం ఖాయం అని నీల్ భయపడుతున్నాడా అన్న డిబేట్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రవి బస్రూర్ మ్యూజిక్..bgm పై నెగెటివ్ కామెంట్స్
ఇకపోతే ప్రశాంత్ నీల్ సినిమాలని రవి బస్రూర్ సంగీతం ఎంతలా ఎలివేట్ చేస్తుందో చెప్పక్కర్లేదు.కాని ‘సలార్’ సినిమాకి ఆయన అందించిన bgm పై నెగెటివ్ కామెంట్స్ గట్టిగానే వినిపించాయ్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్ గా ఉండటం, పాత ట్యూన్లనే వాడటం వంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ‘డ్రాగన్’ కోసం కూడా ఆయనే వస్తుండటంతో, మళ్ళీ అదే రొటీన్ రొట్ట సంగీతం వినాలా అని పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.
also read :బాలయ్య సినిమాపై వైరల్ అవుతున్న క్రేజీ రూమర్స్.. నిప్పు లేనిదే పొగ రాదుగా!
హీరోయిన్ విషయంలో రిస్క్ చేస్తున్నారా?
ఇక కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇక నటన పరంగా రుక్మిణీకి వంక పెట్టాల్సిన పని కూడా లేదు. కానీ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో పక్కన ఆమె సరిపోతుందా? గ్లోబల్ ఇమేజ్ ఉన్న తారక్ కోసం ఒక స్టార్ హీరోయిన్ కాకుండా, కొత్త వాళ్లను తీసుకోవడం సినిమా బిజినెస్ పై ప్రభావం చూపుతుందనేది ట్రేడ్ వర్గాలని తొలిచేస్తున్న ప్రశ్న.ఇక అటు బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ ను తీసుకున్నా, ఆయన రోల్ ఎంతవరకు పవర్ ఫుల్ గా ఉంటుందో చూడాలి.
అతి విశ్వాసం కొంప ముంచుతుందా?
ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోను ఎంత ఎలివేట్ చేసినా, స్క్రీన్ ప్లే విషయంలో ఆడియన్స్ ని కాసింత కన్ఫ్యూజన్ కి గురిచేస్తుంటాడు.గత సినిమా ‘సలార్’లో అయితే సగం సినిమా కథేంటో వివరించడానికే సరిపోయింది. ఇప్పుడు ‘డ్రాగన్’లో కూడా దేవ కట్టా మార్క్ సోషల్ ఎలిమెంట్స్, ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ షేడ్స్ కలిస్తే.. సాలిడ్ బ్లాక్ బస్టర్ కి దారితీస్తుందా లేక ఊహించని షాక్ ఏమైనా తగులుందా అనేది థియేటర్లలోకి వస్తే కాని చెప్పలేము.
అసలే సినిమా కోసం అటు మైత్రీ మూవీ మేకర్స్ ఇటు ఎన్టీఆర్ ఆర్ట్స్ వందల కోట్లు కుమ్మరిస్తున్నాయ్.ఇక ఆభారమంతా నీల్ పైనే ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అయితే దేవ కట్టా ఎంట్రీతో సినిమాకు ‘క్లాస్’ టచ్ వస్తుందని కొందరంటున్నా, అసలు నీల్ మేకింగ్ స్టైల్ కి ఇది సెట్ అవుతుందా లేదా అన్నది మరికొందరి ఆర్గ్యుమెంట్.చూడాలి మరి ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
also read :సత్యారెడ్డికి ఘన సన్మానం..హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘కింగ్ బుద్ధ’ పై క్రేజీ అప్‌డేట్