E-Paper
Advertisement

Salt: ఉప్పును స్టీవ్ డబ్బాల్లో స్టోర్ చేయకూడదా? నిల్వ చేస్తే ఏమవుతుంది?

Salt: ఉప్పును స్టీవ్ డబ్బాల్లో స్టోర్ చేయకూడదా? నిల్వ చేస్తే ఏమవుతుంది?
Advertisement

ఇంట్లో స్టీల్ డబ్బాలు ఎక్కువగా వాడకం కనిపిస్తుంది. బియ్యం, పప్పులు, చక్కెరతో పాటు ఉప్పు కూడా చాలా మంది స్టీల్ కంటైనర్‌లోనే ఉంచుతారు. కానీ తేమ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఇది సరైన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి చివర, వర్షాకాలం ప్రారంభం సమయంలో గాల్లో తేమ పెరుగుతుంది. ఈ సమయంలో ఉప్పు నిల్వపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉప్పు సహజంగా తేమను ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. గాల్లో తేమ ఉన్నప్పుడు ఉప్పు దానిని పీల్చుకుంటుంది. దాంతో ఉప్పు తడిగా మారుతుంది. కొద్ది రోజుల్లోనే చిన్న చిన్న గడ్డలుగా మారుతుంది. చెంచాతో తీసుకోవడం కష్టమవుతుంది. వంటలో చల్లేటప్పుడు సరిగా రాలదు. ఈ సమస్యలు ఎక్కువగా తేమ కాలంలో కనిపిస్తాయి.

స్టీల్ డబ్బా ఎందుకు వాడకూడదు?
స్టీల్ డబ్బా వాడటం వల్ల నేరుగా రియాక్షన్ సమస్య ఉండదు. కానీ ప్రధాన సమస్య గాలి ప్రవేశం. చాలా స్టీల్ డబ్బాలు పూర్తిగా గాలి దిగనివిగా ఉండవు. రోజులో ఎన్నిసార్లు డబ్బా తెరుస్తారు. ప్రతి సారి బయట గాలి లోపలికి చేరుతుంది. గాల్లో ఉన్న తేమ కూడా లోపలికి వస్తుంది. ఆ తేమ ఉప్పులో కలిసిపోతుంది. ఫలితంగా ఉప్పు ముద్దలుగా మారుతుంది.

Advertisement

ఉప్పు గట్టిపడటం చూసి చాలామంది అది పాడైందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. తేమ వల్ల రూపం మాత్రమే మారుతుంది. రుచి లేదా భద్రతపై పెద్ద ప్రభావం ఉండదు. అయినా వాడటానికి అసౌకర్యం కలుగుతుంది. వంట సమయంలో కొలత కుదరదు. కొన్నిసార్లు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది.

Also read: Beetroot juice: వారం రోజులు బీట్ రూట్ జ్యూస్ తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే

Advertisement

ఈ చిట్కాలు పాటించండి
ఈ సమస్యను నివారించేందుకు కొన్ని సులభమైన చిట్కాలు ఉపయోగపడతాయి. ముందుగా ఎయిర్‌టైట్ కంటైనర్ వాడటం మంచిది. గాజు సీసా లేదా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బా ఉపయోగిస్తే గాలి ప్రవేశం తగ్గుతుంది. మూత గట్టిగా ఉండటం ముఖ్యం. ప్రతి సారి వాడిన తర్వాత బాగా మూసేయాలి. ఇంకా ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఉప్పులో కొద్దిగా ముడి బియ్యం గింజలు వేయాలి. ఈ గింజలు తేమను పీల్చుకుంటాయి. దీంతో ఉప్పు పొడిగా ఉంటుంది. కొందరు చిన్న కాగితం ముక్క లేదా టిష్యూ కూడా వేస్తారు. ఇది కూడా తేమ తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉప్పు డబ్బాను ఎక్కడ ఉంచుతున్నాం అనేది కూడా ముఖ్యం. స్టౌ దగ్గర లేదా సింక్ దగ్గర పెట్టడం మంచిది కాదు. అక్కడ వేడి, ఆవిరి, తడి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉప్పుపై ప్రభావం చూపుతాయి. బదులుగా పొడి, చల్లటి ప్రదేశంలో ఉంచాలి. అలాగే తడి చెంచా వాడటం పూర్తిగా నివారించాలి. చిన్న తడి కూడా ఉప్పును గట్టిపడేలా చేస్తుంది. రోజూ చిన్న పరిమాణంలో ఉప్పు వాడే డబ్బా, పెద్ద నిల్వ డబ్బా వేర్వేరుగా ఉంచడం మంచిది. పెద్ద డబ్బాను తరచూ తెరవకపోతే తేమ ప్రభావం తగ్గుతుంది. చిన్న డబ్బా ఖాళీ అయినప్పుడు మాత్రమే మళ్లీ నింపాలి.

Related News

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

Big Stories

Advertisement
×