Priyanka Chopra:గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు ‘వారణాసి’ సినిమాతో పాటు హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో అత్యంత ప్రమాదకరమైన యాక్షన్ సీన్ల కోసం ఆమె డూప్‌ను వాడటం హాట్ టాపిక్‌గా మారింది. నటన నా వృత్తి, కేవలం సాహసాల కోసం ప్రాణాలకు రిస్క్ చేయలేను అని ప్రియాంక స్పష్టం చేసింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సరసన మందాకినిగా మెరవబోతున్న ఈ బ్యూటీ, ఫిబ్రవరి 25న ఓటీటీలోకి రాబోతున్న ఈమె తన సినిమా ప్రమోషన్లలో ఈ విషయాలను పంచుకుంది. ఆ వివరాలు చూద్దాం..
ప్రియాంక చోప్రా అంటేనే సాహసాలకు కేరాఫ్ అడ్రస్ అనుకుంటారు ఫ్యాన్స్. కానీ తాజాగా ఆమె నటించిన ‘ది బ్లఫ్’ సినిమాలో మాత్రం కొన్ని స్టంట్స్‌కు ఆమె స్వయంగా నో చెప్పేసింది. ముఖ్యంగా ముఖంపై గాజు పెంకులు గుచ్చుకునేంత ప్రమాదకరమైన సీన్లు ఉండటంతో, ఆ రిస్క్ తీసుకోలేక డూప్‌తో చేయించినట్లు ప్రియాంక బయటపెట్టింది. నేను సూపర్ హీరోని కాదు, నా పని నేను చేయటం నాకు తెలుసు. అనవసరంగా గాయపడటం ఎందుకు? అని ఆమె నవ్వుతూ చెప్పింది. దర్శకుడు కూడా ఆమె భద్రత దృష్ట్యా ఆ సీన్లలో నటించవద్దని కోరడంతో, నటనకు ప్రాధాన్యత ఇస్తూ యాక్షన్ పార్ట్‌ను నిపుణులకు వదిలేసింది.
ప్రియాంక ప్రస్తుతం ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే భారీ ప్రాజెక్టులో నటిస్తోంది. మహేష్ బాబు హీరోగా రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక ‘మందాకిని’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. చాల కాలం తరువాత తెలుగు లో నటిస్తుండటం విశేషం.ఇక రాజమౌళి సినిమాలో నటించడం నా కెరీర్‌కే ఒక కొత్త అర్థం ఇస్తుంది. ఈ సినిమా కోసం అభిమానుల కంటే నేనే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ప్రియాంక మనసులో మాట చెప్పింది. రాజమౌళి విజన్‌కు ఫిదా అయిన ఈ భామ, తన కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
ALSO READ:Tollywood Movies: మిస్సైన మ్యాజిక్.. ఆ సీన్లు ఉంటే ఈ సినిమాల రేంజ్ మరోలా ఉండేదేమో!
ఇక గతంలో ‘క్వాంటికో’, ‘సిటాడెల్’ వంటి సినిమాల్లో అద్భుతమైన యాక్షన్ చూపించిన ప్రియాంక, ఇప్పుడు ‘ది బ్లఫ్’లో మరోసారి మాస్ అవతారంలో కనిపించనుంది. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. సముద్రపు దొంగల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రియాంక తనదైన నటనతో అలరించబోతోంది. ఇక ఒకవైపు హాలీవుడ్ సినిమాలు, మరోవైపు ఇండియన్ ప్రాజెక్టులతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నా, ఎక్కడా తగ్గకుండా తన బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ సక్సెస్ చేరినట్టే.