E-Paper
Advertisement

Mrunal Thakur: ఆమె నాకు స్ఫూర్తి… స్టార్ హీరోయిన్ పై మృణాళ్ కామెంట్స్!

Mrunal Thakur: ఆమె నాకు స్ఫూర్తి… స్టార్ హీరోయిన్ పై మృణాళ్ కామెంట్స్!
Advertisement

Mrunal Thakur: సీతారామం సినిమా ద్వారా సీతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) తన మొదటి సినిమాతోనే పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సినిమా అనంతరం ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా మృణాళ్ ఠాకూర్ మరొక స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మా ఇద్దరి ప్రయాణం వేరు..

ప్రియాంక చోప్రా గురించి మృణాళ్ మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రా లైఫ్ జర్నీ నాకు స్ఫూర్తి అని తెలియజేశారు. ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూలను తాను ఎక్కడా కూడా మిస్ అవ్వనని ప్రతి ఒక్క విషయాన్ని ఫాలో చేస్తుంటానని తెలియజేశారు. ప్రియాంక ప్రయాణం, నా ప్రయాణం వేరు… మా ఇద్దరిలో ఒకే ఒక కామెంట్ పాయింట్ ఉంది. ఇద్దరం కష్ట కాలంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా, ఎంతో కృషి ,పట్టుదలతో ముందడుగు వేశామని తెలిపారు. ప్రియాంక యువతకు ఇచ్చే సూచనలు, ఆమె మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుతుందని మృణాళ్ ఠాకూర్ తెలియజేశారు.

ప్రియాంక లాంటి మహిళలు ఇండస్ట్రీకి అవసరం..

Advertisement

ప్రియాంక చోప్రా లాంటి మహిళలు సినిమా ఇండస్ట్రీకి రావడం చాలా అవసరమని ఇలాంటి మహిళలు ఇంకా చాలామంది రావాలి అంటూ ప్రియాంక చోప్రాపై ప్రశంసలు కురిపిస్తూ ఆమె పట్ల తనుకున్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తూ మృణాళ్ ఠాకూర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు గ్లోబల్ రేంజ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ప్రియాంక తనకు ఇన్స్పిరేషన్ అంటూ మృణాళ్ కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

మందాకిని పాత్రలో ప్రియాంక..

Advertisement

ఇక ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న వారణాసి సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఇండియన్ సినిమాలకు దూరంగా ఉన్న ప్రియాంక చోప్రా ఏకంగా రాజమౌళి సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక మృణాళ్ ఠాకూర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పలు బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా బిజీగా ఉన్నారు. తెలుగులో ఈమె డెకాయిట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా తెలుగు హిందీ సినిమాలు పనులలో బిజీగా ఉన్న మృణాళ్ తమిళంలోకి కూడా అడుగు అడుగుపెడుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

Also Read: Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్.. కన్ఫమ్ చేసిన డైరెక్టర్.. త్వరలోనే గుడ్ న్యూస్!

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×