E-Paper
Advertisement

Abhishek Sharma vs Chris Gayle: అభిషేక్ శ‌ర్మ వ‌ర్సెస్ క్రిస్ గేల్..ఇందులో ఎవ‌రు రియ‌ల్ “యునివర్సల్‌ బాస్‌ “

Abhishek Sharma vs Chris Gayle: అభిషేక్ శ‌ర్మ వ‌ర్సెస్ క్రిస్ గేల్..ఇందులో ఎవ‌రు రియ‌ల్ “యునివర్సల్‌ బాస్‌ “
Advertisement

Abhishek Sharma vs Chris Gayle: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సరికొత్త చర్చ మొదలైంది. న్యూజిలాండ్ జట్టు పైన జరిగిన మూడవ టి20 లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma) విధ్వంసం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు సాధించిన అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. కొంచంలో యువరాజ్ సింగ్ రికార్డును మిస్సయిన అభిషేక్ శర్మ.. ప్రత్యర్ధులకు డేంజర్ బెల్స్ పంపించాడు. అయితే అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో… యూనివర్సల్ బాస్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. క్రిస్ గేల్ ( Chris Gayle) కంటే భయంకరంగా మారిపోయాడని అంటున్నారు అభిమానులు.

 Also Read: Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌ 

అభిషేక్ శర్మ వర్సెస్ క్రిస్ గేల్… ఇందులో ఎవరు గొప్ప ?

Advertisement

న్యూజిలాండ్ జట్టుపై మూడవ టీ20లో భయంకరమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మను ఆకాశానికి ఎత్తుతున్నారు జనాలు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే యూనివర్సల్ బాస్ గా పేరుగాంచిన క్రిస్ గేల్ కంటే తోపు ప్లేయర్ అభిషేక్ శర్మ అని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది మాత్రం అభిషేక్ శర్మ కంటే క్రిస్ గేల్ గొప్పవాడని.. అతడిని మించిన ఆటగాడు ఎవడు లేడని అంటున్నారు.

అయితే ఈ ఇద్దరి మధ్య రికార్డులు, అత్యధిక పరుగులు పరిశీలిస్తే పరిస్థితి వేరేగా ఉంది. అభిషేక్ శర్మ తన మొదటి 36 మ్యాచ్ లలో అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేశాడు. తన మొదటి 36 మ్యాచ్ ల‌లో ఏకంగా 1267 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 195.22 గా ఉంది. ఇక అతని యావరేజ్ 38.39 అని చెప్పవచ్చు. ఇందులో అభిషేక్ శర్మ హైయెస్ట్ స్కోర్ 135 పరుగులు ఉన్నాయి. అలాగే 8 అర్థ సెంచరీలు సాధించాడు అభిషేక్ శర్మ.

Advertisement

అటు యూనివర్సల్ బాస్ గా పేరుగాంచిన క్రిస్ గేల్ తన మొదటి 36 మ్యాచ్ ల‌లో కేవలం 1060 పరుగులు మాత్రమే సాధించాడు. 33.21 యావరేజ్ సంపాదించిన క్రిస్ గేల్, 141.15 స్ట్రైక్ రేటుతో ఇరగదీశాడు. ఇందులో కేవలం ఒకే ఒక సెంచరీ నమోదు చేశాడు క్రిస్ గేల్. 117 పరుగులు అతని హైయెస్ట్ స్కోరు. ఇక సెంచరీ తో పాటు పది అర్థ సెంచరీలు నమోదు చేశాడు క్రిస్ గేల్. ఈ లెక్కన చూస్తే యూనివర్సల్ బాస్ గా అభిషేక్ శర్మ కు బిరుదు ఇవ్వవచ్చని అంటున్నారు. క్రిస్ గేల్ కంటే అభిషేక్ శర్మ భయంకరంగా మారిపోయాడని.. ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. ఇక నుంచి యూనివర్సల్ బాస్ గా అభిషేక్ శర్మను పిలవాలని కోరుతున్నారు.

 Also Read: Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !

 

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×